Ponniyin Selvan Release Date: మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్-1'. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలుగా చేసిన విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవి ఫస్ట్‌లుక్‌లు విడుదలయ్యాయి. వీటితో పాటు చిత్రం మొదటి భాగం విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. 2022, సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
![Ponniyin Selvan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14617806_vikaram.jpg)
![Ponniyin Selvan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14617806_ish.jpg)
Ponniyin Selvan First Look: బుధవారం విడుదల చేసిన ఒక్కో పోస్టర్‌ను మతి పోయోలా తీర్చిదిద్దారు స్టార్ డైరెక్టర్ మణిరత్నం. 2019 డిసెంబర్‌లోనే థాయ్‌లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి నుంచి సినిమా చిత్రీకరణ తిరిగి శరవేగంగా జరుపుకొంటోంది.
![Ponniyin Selvan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14617806_trisha.jpg)
![Ponniyin Selvan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14617806_karthi.jpg)
![Ponniyin Selvan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14617806_jayam.jpg)
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జయరామ్, శోభిత ధూళిపాళ్ల, శరత్ కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కనిపించనున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇదీ చూడండి: విజువల్ వండర్‌గా.. 'రాధేశ్యామ్' రిలీజ్ ట్రైలర్