ETV Bharat / sitara

'అబ్బాయిలా ఉన్నావని అనేవారు.. చాలా బాధపడ్డా' - మగాడిలా ఉన్నావన్నారు.. అనన్యా పాండే

తాను అబ్బాయిలా ఉన్నానంటూ కొందరు ట్రోల్స్ చేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది బాలీవుడ్ నటి అనన్యా పాండే. మొదట ఆ విమర్శలు బాధపెట్టినా తర్వాత వాటిని ఎంజాయ్ చేశానని వెల్లడించింది.

Ananya on skinny shaming
అనన్యా పాండే
author img

By

Published : Mar 10, 2021, 9:23 AM IST

కెరీర్ ప్రారంభంలో తానూ ట్రోల్స్ బారినపడ్డట్లు వెల్లడించింది బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే. కొందరు తన శరీరాకృతిపై కామెంట్లు చేసేవారని తెలిపింది. తన శరీరం అబ్బాయిల్లా ఉండేదని అంటుంటే ఎంతో బాధగా ఉండేదని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

"నాకు సరిగా గుర్తులేదు. కానీ నేను మా పేరెంట్స్​తో దిగిన ఫొటో అది. అప్పటికీ నేను నటిని కాదు. ఆ ఫొటో చూసి నేను చాలా సన్నగా ఉన్నా, నన్ను అందరూ అబ్బాయిలా ఉన్నావని అంటున్నారు అని మా తల్లిదండ్రులకి చెప్పా. అలా వారు విమర్శించినపుడు చాలా బాధగా అనిపించేది. ఎందుకంటే కెరీర్​లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన సమయంలో ఇలాంటి ట్రోల్స్ మనల్ని బలహీనుల్ని చేస్తాయి. ఆ తర్వాత విమర్శల్ని తేలికగా తీసుకోవడం మొదలుపెట్టా. ప్రారంభంలో అలాంటి మాటలు బాధపెట్టినా.. ఆ తర్వాత ఎంజాయ్ చేశా."

-అనన్యా పాండే, హీరోయిన్

2019 జూన్​లో 'సో పాజిటివ్' అనే పేరుతో సోషల్ మీడియాలో ఓ ప్రచారాన్ని ప్రారంభించింది అనన్యా పాండే. సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలు, బెదిరింపుల్ని అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.