2009 ఎన్నికల్లో తప్ప ఇంతవరకూ నిజ జీవిత రాజకీయాల్లో ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు. తాజాగా రాజకీయల నేపథ్యంలో తన తర్వాతి చిత్రం ఉంటోందని టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో కలిసి పని చేయబోతున్నాడని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి.
దిల్లీలో చక్రం తిప్పటానికి సై!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా పొలిటికల్ టచ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సినిమాకు 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పేరు కాస్త విచిత్రంగా అనిపించినా.. 'అ' అనే అక్షరం మాటల మాంత్రికుడి సెంటిమెంట్‌కి కలిసొచ్చిందట. అందుకే.. తన తదుపరి సినిమా కూడా 'అ'తో ఉండాలని ఆ పేరు పెట్టారట. ఈ టైటిల్‌కు మహాభారతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే దాన్ని తనదైన శైలిలో మలుచుకుని పొలిటికల్ టచ్ ఇస్తున్నాడట.
రాష్ట్ర రాజకీయాలు కాకుండా హస్తినా (దిల్లీ)లో ఎన్టీఆర్‌తో చక్రం తిప్పించబోతున్నాడట మాటల మాంత్రికుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పుకార్లు నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇదీ చూడండి.. 'అశ్వథ్థామ'లో పవర్‌స్టార్.. నాగశౌర్య క్లారిటీ