ETV Bharat / sitara

ఎన్టీఆర్​-కొరటాల మూవీ క్రేజీ అప్డేట్​.. 'గని' కోసం బన్నీ - సాయి తేజ్​

NTR Koratala Siva Movie: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో తారక్-కొరటాల శివ కాంబినేషన్​లో రానున్న మూవీ సహా వరుణ్​ తేజ్ 'గని', 'మిషన్ ఇంపాజిబుల్', 'బ్రహ్మాస్త్ర', విశ్వక్​ సేన్ చిత్రాల విశేషాలు ఉన్నాయి.

ntr new movie
NTR Koratala Siva Movie
author img

By

Published : Mar 29, 2022, 1:44 PM IST

NTR Koratala Siva Movie: యంగ్​టైగర్​ ఎన్టీఆర్​-కొరటాల శివ దర్శకత్వంలో రానున్న సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది జూన్​లో ప్రారంభించనున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు తారక్. నటుడిగా తనను ఉత్తేజపరిచే దర్శకుడు కొరటాల అని పేర్కొన్నారు.

NTR Koratala Siva Movie
తారక్

తారక్​-కొరటాల కాంబినేషన్​లో ఇదివరకే వచ్చిన 'జనతా గ్యారేజ్'​ బ్లాక్​ బస్టర్​ హిట్​గా నిలిచింది. దీంతో ఈ కాంబినేషన్​పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇంటెన్స్​ యాక్షన్​ డ్రామాగా పాన్​ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందులో ఆలియా భట్​ నటించే అవకాశం ఉంది.

ghani pre release event
.

'గని' కోసం రంగంలోకి బన్నీ: మెగాహీరో వరుణ్​ తేజ్​ నటించిన 'గని' ప్రీరిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఐకాన్​స్టార్ అల్లుఅర్జున్. ఏప్రిల్​ 2న వైజాగ్​లో ఈ వేడుక జరగనుంది. బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్​ హీరోయిన్. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ఏప్రిల్ 8న సినిమా విడుదలకానుంది.

brahmāstra
రణ్​బీర్, ఆలియా, అయాన్

ఎట్టకేలకు షూటింగ్​ పూర్తి: బాలీవుడ్​ స్టార్​ రణ్​బీర్​ కపూర్​-ఆలియా భట్​ జంటగా నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' పార్ట్​ 1 షూటింగ్​ పూర్తయింది. దాదాపు ఏడేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్​లో అమితాబ్​ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. 2022 సెప్టెంబరు 9న.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం మొదటి భాగం విడుదలకానుంది.

brahmāstra
'బ్రహ్మాస్త్ర'

'మిషన్​ ఇంపాజిబుల్​'కు నవీన్​ గాత్రదానం: తనకు 'ఏజెంట్​ సాయి శ్రీనివాస్​ ఆత్రేయ' లాంటి సూపర్​ హిట్​ అందించిన దర్శకుడు స్వరూప్​ ఆర్​ఎస్​జే కోసం రంగంలోకి దిగారు యువ హీరో నవీన్ పొలిశెట్టి. తాప్సీ ప్రధాన పాత్రలో స్వరూప్​ తెరకెక్కించిన 'మిషన్ ఇంపాజిబుల్'​ సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు నవీన్. ఇటీవలే విడుదలై చిత్ర ట్రైలర్​ మంచి ఆదరణ పొందింది. సినిమా ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలకానుంది.

mishan impossible telugu movie
'మిషన్​ ఇంపాజిబుల్​'

లాయర్​గా విశ్వక్: యువ హీరో విశ్వక్​సేన్ నటిస్తున్న కొత్త చిత్రం 'ముఖచిత్రం'. ఇందులో అతడు లాయర్​ 'విశ్వామిత్ర'గా కనిపించనున్నారు. గంగాధర్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్​ప్లే, మాటలను సందీప్​రాజ్​ అందించారు. నేడు (మార్చి 29) విశ్వక్ పుట్టినరోజు సందర్భంగా అతడి లుక్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం.

vishwak sen upcoming movies
'ముఖచిత్రం'లో విశ్వక్​ పోస్టర్
vishwak sen upcoming movies
.

సాయి తేజ్​కు ఘన స్వాగతం: రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారి షూటింగ్​ సెట్​లో అడుగుపెట్టారు మెగా హీరో సాయి తేజ్. బీవీఎస్​ఎన్​ ప్రసాద్, దర్శకుడు సుకుమార్​ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. మరిన్ని వివరాలను త్వరలో తెలియజేయనున్నారు. మంగళవారమే షూటింగ్​ ప్రారంభం కాగా, సెట్​లోకి వచ్చిన సాయి తేజ్​కు ఘన స్వాగతం లభించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్'​​పై తారక్​ భావోద్వేగం.. మాటలు రావడం లేదంటూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.