బాలీవుడ్ హిట్ 'అందాధున్' తెలుగు రీమేక్ 'మ్యాస్ట్రో' నుంచి అప్డేట్ వచ్చింది. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ షూటింగ్ సోమవారం(జూన్ 14) ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది.
ఇందులో నితిన్ సరసన నభానటేశ్ నటిస్తుండగా.. తమన్నా కీలకపాత్రలో కనిపించనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షెడ్యూల్లో నితిన్-తమన్నాలపై కీలక సన్నివేశాలు షూటింగ్ చేయనున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడు.
ఇవీ చదవండి: