'ఇస్మార్ట్ శంకర్' రూపంలో బంపర్ హిట్‌ను అందుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్. హిట్ అయితే వచ్చింది కానీ ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. తాజాగా ఎట్టకేలకు మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సినిమా కోసం నిధి తీసుకోనున్న పారితోషికం చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాలో నటించడానికి నిధి అగర్వాల్ దాదాపు కోటి రూపాయల వరకు తీసుకుంటుందట. డెబ్యూ హీరో పక్కన నటించాలంటే ఆమాత్రం ఇవ్వాల్సిందే అని అంటున్నాయి సినీ వర్గాలు. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.
ఇవీ చూడండి.. 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..!