నెట్‌ఫ్లిక్స్ భారత వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ 48 గంటలపాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సేవలను అందించనున్నారట. నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో భాగంగా 'స్ట్రీమ్ ఫెస్ట్' అనే కార్యక్రమం నిర్వహించబోతోంది. తొలుత మన దేశంలోనే ఈ వినూత్న ప్రయోగం చేయనున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 4 నుంచి 48 గంటలు ఉచిత నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ తీసుకొస్తున్నారు.
ఆ స్థానంలో..
గతంలో సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా వినియోగదారులు నెల పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సేవలు పొందే అవకాశం ఉండేది. ఇటీవల దానిని కొన్ని దేశాల్లో తొలగించారు. ఇప్పుడు దాని స్థానంలో ఈ 48 గంటల ఆఫర్ తీసుకొస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత నెలలో నెల రోజుల ఉచిత సేవల ఆఫర్‌ని అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందీ సంస్థ. భారత్‌లో మాత్రం ఈ ఆఫర్ ఇంకా అందుబాటులోనే ఉంది. త్వరలో మనదేశంలోనూ నెలరోజుల ఉచిత సేవలకు చరమగీతం పాడి.. ఆ స్థానంలో ఈ 48 గంటల ఉచిత సేవలను తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:కరోనా తర్వాత ముఖానికి రంగేసిన విద్యాబాలన్!