ETV Bharat / sitara

నెట్​ఫ్లిక్స్​ బంప‌ర్ ఆఫ‌ర్.. ఫ్రీగా సినిమాలు, సిరీస్​లు

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ బంఫర్​ ఆఫర్​ ప్రకటించింది. తమ ప్లాటఫామ్​లో ఉచితంగా సినిమాలు, వెబ్​సిరీస్​లు చూసే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ఏం చేయాలంటే?

author img

By

Published : Nov 21, 2020, 1:11 PM IST

Updated : Nov 21, 2020, 1:22 PM IST

netflix
నెట్​ఫ్లిక్స్​

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​.. మన దేశంలోని సినిమా, వెబ్​ సిరీస్​ ప్రేమికుల కోసం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. డిసెంబరు తొలి వారాంతంలో(5-6 తేదీల్లో) ఉచితంగా అన్ని సినిమా, వెబ్ సిరీస్​లు, డాక్యుమెంటరీలను చూడొచ్చని వెల్లడించింది.

"మా(నెట్​ఫ్లిక్స్​లో) దగ్గర ఉన్న కొత్త కథలు, సిరీస్​లతో పాటు మేం ఎలా పనిచేస్తున్నామో భారత్​లో ఉన్న అందరికీ తెలియాలి. అందుకే డిసెంబరు తొలి వారాంతంలో నెట్​ఫ్లిక్స్​ను ఉచితంగా ఇస్తున్నాం" అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

మీ పేరు, ఈమెయిల్/ ఫోన్ నంబర్​తో లాగిన్ అయితే సరిపోతుంది. అయితే ఒక ఫోన్​ నంబర్​తో ఒక అకౌంట్ మాత్రమే లాగిన్ అవ్వొచ్చు. ఎలాంటి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇదీ చూడండి : నెట్​ఫ్లిక్స్​లో ఉచితంగా ఈ సినిమాలు,వెబ్ సిరీస్​లు

Last Updated : Nov 21, 2020, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.