ETV Bharat / sitara

నాని 'టక్ ​జగదీశ్'​ విడుదల తేదీ వాయిదా - నాని టగదీశ్​ విడుదల తేదీ వాయిదా

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన 'టక్‌ జగదీష్‌' సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది చిత్రబృందం.

tuckjagadish
టక్​జగదీశ్
author img

By

Published : Apr 12, 2021, 7:27 PM IST

టాలీవుడ్‌లో మరో సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవల 'లవ్‌ స్టోరీ' చిత్రం విడుదల వాయిదా పడగా.. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న 'టక్‌ జగదీష్‌' విడుదల కూడా పోస్ట్​పోన్​ అయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్స్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. "ప్రస్తుతం నెలకొన్న కారణాల వల్ల ‘టక్‌ జగదీష్‌’ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించాం. తదుపరి విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తా" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. అయితే.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంతోనే చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుందా.. లేక వేరే ఏమైనా కారణాలున్నాయా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'టక్‌ జగదీష్‌' చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నాని సరసన రీతూవర్మ సందడి చేయనుంది. జగపతిబాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. తమన్‌ సంగీతం అందించారు. శివనిర్వాణతో కలిసి నాని చేస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'నిన్ను కోరి' ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'లవ్​స్టోరీ' వాయిదా- 'రౌడీ బాయ్స్'లో అనుపమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.