ETV Bharat / sitara

మహర్షి, జెర్సీ చిత్ర బృందాలకు పవన్​ అభినందనలు - మహేశ్​, నానికి పవన్​ అభినందనలు

'జెర్సీ', 'మహర్షి' సినిమాలకు జాతీయ అవార్డులు దక్కడంపై జనసేన అధ్యక్షుడు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్.. ఆ చిత్ర బృందాల్ని అభినందించారు. తాను నటించిన సినిమాకు పురస్కారం దక్కడంపై హీరో నాని హర్షం వ్యక్తం చేశారు.

nani
నాని
author img

By

Published : Mar 22, 2021, 9:21 PM IST

Updated : Mar 22, 2021, 10:30 PM IST

67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని 'జెర్సీ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్​బాబు 'మహర్షి'కి అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్.. ఆ చిత్ర బృందాల్ని అభినందించారు. జాతీయ పురస్కారాలు ఇచ్చిన స్ఫూర్తితో ప్రేక్షకులను మెప్పించే మరిన్ని మంచి చిత్రాలను నిర్మాతలు అందించాలని ఆకాంక్షించారు.

pawan
పవన్​కల్యాణ్​

కాగా, 2018 అ, 2019 జెర్సీకి వరుసగా జాతీయ పురస్కారాలు లభించడం ఉత్సాహాంగా ఉందన్న నాని.. వచ్చే ఏడాది అవార్డుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు మహర్షి చిత్రానికి రెండు జాతీయ పురస్కారాలు దక్కడం పట్ల దర్శక నిర్మాతలు దిల్ రాజు, వంశీపైడిపల్లి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ వల్లే మహర్షికి జాతీయ పురస్కారం దక్కిందని పేర్కొన్న దర్శకుడు వంశీపైడిపల్లి... ఈ పురస్కారాన్ని ప్రేక్షకులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. మహర్షి కథ విన్నప్పుడే మహేశ్ బాబు ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతోపాటు ప్రశంసలు, పురస్కారాలు దక్కుతాయన్నారని వంశీపైడిపల్లి వివరించారు. మహర్షికి పురస్కారంతోపాటు లభించే నగదును ఓ మంచి కార్యక్రమానికి వినియోగించనున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ సొసైటీలోని నిర్మాణ సంస్థ కార్యాలయం వద్ద బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

నాని, దిల్​రాజు

ఇదీ చూడండి: జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీరే

Last Updated : Mar 22, 2021, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.