బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించి 'సూపర్ 30'తో మంచి విజయాన్ని అందుకుంది నటి మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా చేసిన 'జెర్సీ' విడుదలకు రెడీగా ఉంది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కానుంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈసినిమా గురించి మృణాల్ ఠాకూర్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన లైఫ్ స్టైల్, బ్రేకప్‌పై స్పందించింది. టీనేజీలో ఉన్నప్పుడు పలు సందర్భాల్లో తాను మానసిక కుంగుబాటుకు లోనయ్యానని చెప్పింది. అప్పుడప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా తనను వెంటాడేవని ఆమె పేర్కొంది.
![Mrunal Thakur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14452668_mrunal.jpg)
"టీనేజీలో ఉన్నప్పుడు నాకు ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉండేది. పెళ్లి, పిల్లలతో కాకుండా కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండాలనేది నా కోరిక. అందుకు అనుగుణంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు అడుగులు వేశా. నటిగా మీ అందరి అభిమానాన్ని పొందుతున్నా" అని మృణాల్ చెప్పింది.
అనంతరం తన లవ్‌స్టోరీపై స్పందిస్తూ.. "జీవిత భాగస్వామిని పొందే క్రమంలో ఎంతో మంది వ్యక్తులు మనం జీవితంలోకి వస్తుంటారు. వాళ్లు మనకు సరిపోతారా?లేదా?అనేది మాత్రం మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వాళ్లు మనకి నప్పరు అనుకున్నప్పుడు విడిపోక తప్పదు. సుమారు 7 నెలల క్రితం నాకొక బ్రేకప్ జరిగింది. నేను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందినవాడు. పద్ధతులు, కట్టుబాట్లు ఫాలో అవుతాడు. మేమిద్దరం ఇష్టపడ్డాం.. కాకపోతే, నేను నటినని అతను నన్ను వదిలి పారిపోయాడు. అతనిపై నాకు ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే, ఇప్పుడు మేమిద్దరం సర్ది చెప్పుకొని రిలేషన్ ముందుకు తీసుకువెళ్లినా, మాకు పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్లని పెంచే సమయంలో మా మధ్య గొడవలు రావొచ్చు" అని మృణాల్ తెలిపింది.
ఇవీ చదవండి: