*శర్వానంద్ 'శ్రీకారం' టీజర్.. ఫిబ్రవరి 9న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. పల్లెటూరి నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్లలోకి రానుంది. కిశోర్ దర్శకుడు.

*విశాల్-ఆర్య మల్టీస్టారర్ 'ఎనిమీ' సినిమాలోని కీలక పాత్ర కోసం మమతా మోహన్‌దాస్ ఎంపికైంది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది.

*కార్తికేయ 'చావు కబురు చల్లగా' చిత్రంలోని 'మై నేమ్ ఈజ్ రాజు' లిరికల్ గీతం.. శనివారం ఉదయం రిలీజ్ కానుంది. ఇందులో బస్తీ బాలరాజు అనే మాస్ పాత్రలో కార్తికేయ కనిపించనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్.

*'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' తమిళ టీజర్‌ను విజయ్ సేతుపతి విడుదల చేశారు. అదిత్, శివాత్మిక ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. కేవీ గుహన్ దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి: