*బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్.. ఓ సినిమాలో నటించనున్నారు. లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌కు తండ్రిగా కనిపించనున్నారు. త్వరలో షూటింగ్‌కు హాజరు కానున్నారు

*ప్రముఖ నటి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంగీకారం తెలిపింది. 'డ్రైవర్ జమున' టైటిల్‌తో దీనిని తెరకెక్కించనున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


*అన్నిచోట్ల పాజిటివ్ తెచ్చుకున్న 'క్రాక్' సినిమా.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. చాలా రోజుల తర్వాత మంచి మాస్ చిత్రం చూశామని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు.


ఇది చదవండి: