'మిస్టర్ మజ్ను' సినిమాతో ప్రేక్షకులను గతేడాది అలరించిన టాలీవుడ్ యువ కథానాయకుడు అఖిల్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రటైటిల్ను ఇంకా ఖరారు కాలేదు. తాజాగా ఈ విషయంపై నిర్మాణసంస్థ స్పందించింది. #అఖిల్4 పేరును, ఫిబ్రవరి 4 సాయంత్రం 5:15 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. అయితే ఆ పేరు ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
![Most Eligible Bachelor Is this the title for Akhil4?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5938023_pic.jpg)
రొమాంటిక్ ప్రేమ కథతో రూపొందుతున్న ఈ సినిమాకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' పేరు పరిశీలిస్తున్నట్టు టాక్. ఇందులో అఖిల్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
![Most Eligible Bachelor Is this the title for Akhil4?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5938023_pic1.jpg)
ఇదీ చూడండి.. 'ఫ్రెండ్షిప్'తో తెరంగేట్రం చేస్తున్న హర్భజన్ సింగ్