Manchu lakshmi mohan babu home: ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో హోమ్‌టూర్ వీడియోలు చాలా కనిపిస్తున్నాయి. సాధారణ యూట్యూబర్ నుంచి సెలబ్రిటీల వరకు తమ ఇంటి వీడియోలను తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మంచు లక్ష్మీ కూడా తన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఉంటున్న ఇంద్రభవనం లాంటి ఇంటిని వీడియో తీసి పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో గార్డెన్ ఏరియా, చిన్నారుల కోసం ప్రత్యేక గది, జిమ్, స్టీమ్రూమ్, మినీ థియేటర్.. ఇలా ఇంటిలోని గదులన్నింటిని చూపించారు. మోహన్‌బాబు రూమ్‌ను మాత్రం చూపించలేదు. ఇందులో భాగంగా కుమార్తె విద్వా నిర్వాణతో కలిసి లక్ష్మీ ఇల్లాంతా తిరుగుతూ సందడి చేశారు.
తన తండ్రి మోహన్‌బాబు విజయప్రస్థానం గురించి వీడియో చివర్లో చెప్పారు మంచు లక్ష్మీ. 'మొదుగులపాలెం అనే ఓ చిన్న మారుమూల గ్రామం నుంచి ఏదో సాధించాలి. నాది ఇది కాదు, అనుకుని వచ్చిన ఆ ఒక్క మనిషి(మోహన్‌బాబు).. ఆ గ్రామం నుంచి బయటకు వచ్చి తన స్వయంకృషితో ఇంత నిర్మించారు. ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఎమోషనల్ అవుతాను. మా నాన్ను ఏది అడిగే హక్కు నాకు లేదు. ఇంత పేరు, విద్య, ప్రఖ్యాతలు అన్నీ ఇచ్చారు. దీనిని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మాత్రమే నాకు ఉంది. మా నాన్నను చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నాను' అని మంచు లక్ష్మీ చెప్పారు.
మోహన్‌బాబు ప్రస్తుతం 'సన్నాఫ్ ఇండియా' సినిమా చేస్తున్నారు. మంచు లక్ష్మీ.. నటిగా, వ్యాఖ్యాతగా పలు సినిమాలు, షోలు చేస్తూ బిజీగా ఉన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: