బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిపై అత్యాచార ఆరోపణలతో ఓషివారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని నమ్మించి 2015 నుంచి తనపై అతడు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పాడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తీరా పెళ్లి గురించి ప్రస్తావిస్తే అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గర్భం దాల్చిన తర్వాత దాన్ని తీపించుకోవాల్సిందిగా మహాక్షయ్ తనపై ఒత్తిడి తెచ్చాడని తెలిపింది.
బుల్లితెర నటి మదాలస శర్మతో 2018లో మహాక్షయ్ చక్రవర్తి వివాహం జరిగింది. ఆ సమయంలో అతడిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా.. దానిపై పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో దిల్లీలోని రోహిణి కోర్టును బాధితురాలు ఆశ్రయించగా..మహాక్షయ్ చక్రవర్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.