ETV Bharat / sitara

ఫస్ట్​లుక్: కత్తి పట్టుకున్న 'ఆచార్య' - చిరంజీవి ఆచార్య సినిమా

మెగాస్టార్-కొరటాల కాంబినేషన్​లో రూపొందుతున్న 'ఆచార్య' సినిమా ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానుందీ చిత్రం.

ఫస్ట్​లుక్: కత్తి పట్టుకున్న 'ఆచార్య' చిరు
ఆచార్యలో చిరంజీవి
author img

By

Published : Aug 22, 2020, 4:19 PM IST

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న 152వ చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకుడు. శనివారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.

కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్‌ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్‌. రామ్‌చరణ్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అటు కొరటాల, ఇటు చిరు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరు సుజీత్‌ దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.