ETV Bharat / sitara

వీళ్లు హీరోయిన్లే కాదు.. రచయిత్రులు కూడా! - క్రాకింగ్ కోడ్: మై జర్నీ ఇన్​ బాలీవుడ్

తమ నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే కొందరు నటీమణులు.. రచయిత్రులుగానూ సత్తా చాటుతున్నారు. తమ జీవితంలో ఎదురైన పలు అనుభవాల్ని బుక్స్​గా రాసి, పుస్తక ప్రియుల మనసులు దోచేస్తున్నారు.

Bollywood divas who turned authors
కథానాయికలుగానే కాదు.... రచయిత్రులుగానూ ఎదిగి!
author img

By

Published : Nov 21, 2020, 5:41 PM IST

బాలీవుడ్​లోని పలువురు స్టార్ హీరోయిన్లు నటనతో పాటు ఇతర రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా పేరు తెచ్చుకుంటున్నారు. దీంతో పాటే రచనా శైలితోనూ గొప్ప రచయిత్రులుగా పేరు సంపాదిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఏయే పుస్తకాలు రాశారు?

శిల్పాశెట్టి

నటిగా, ఫిట్​నెస్​-యోగా కోచ్​గా, బిజినెస్​ ఉమెన్​గా శిల్పా శెట్టి మంచి పేరు సంపాదించుకుంది. వీటితో పాటు ఈమె ఓ పుస్తకమూ రాసింది. 2015లో మార్కెట్లోకి వచ్చిన ఈ బుక్ పేరు 'ది గ్రేట్ ఇండియన్ డైట్'. తన లైఫ్​స్టైల్ కోచ్ లూక్ కౌటిన్హోతో కలిసి దీనిని పూర్తి చేసింది శిల్ప. మంచి ఆహారం, రెగ్యులర్​గా డైట్​ పాటించడం లాంటి అంశాలను ఇందులో ప్రస్తావించింది.

Bollywood divas who turned authors
శిల్పా శెట్టి కుంద్రా

దివ్య దత్తా

తన తల్లిపై ప్రేమను అక్షర రూపంలో పెట్టి 'మీ అండ్ మా' పుస్తకాన్ని రూపొందించి, రచయిత్రిగా మారింది నటి దివ్య దత్తా. 2017 పిభ్రవరిలో విడుదలైన ఈ పుస్తకంలో.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి ఎలా సహాయం చేసిన సందర్భాలను వివరించింది.

Bollywood divas who turned authors
దివ్య దత్త

అను అగర్వాల్

ఆషికీ సినిమాతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న అను అగర్వాల్..​ తన జీవితంలో ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొంది. 'అను​ యూజువల్: 2015లో మృత్యువును జయించిన ఓ బాలిక కథ' పుస్తకాన్ని రాసింది. జీవితంలో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లను ఇందులో పొందుపరిచింది. ఉత్తరాఖండ్​లోని యోగా ఆశ్రమంలో తను గడిపిన రోజులు, ముంబయికి వచ్చి నటిగా ఎదగడం, ఘోర రోడ్డు ప్రమాదంలో 29 రోజుల పాటు కోమాలోకి వెళ్లడం లాంటి అనుభవాలు ఇందులో పంచుకుంది.

Bollywood divas who turned authors
అను అగర్వాల్

సోహా అలీ ఖాన్

ఆక్స్​ఫర్డ్​లో ఉన్నత చదువులు చదివి, నటిగా జీవితం సాగిస్తున్న సోహా అలీ ఖాన్​కు పుస్తకాలంటే పిచ్చి. 2017లో 'పెరిల్స్​ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్'​ బుక్​ను స్వయంగా రాసింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ కుటుంబాల నుంచి వచ్చి.. ప్రత్యేకంగా ఎదగడం ఎంత కష్టమో కాస్త నిరాశ కనబరుస్తూ హాస్యాస్పదంగా వివరించింది. పాఠకుల నుంచి ఈ పుస్తకానికి మంచి స్పందన రావడం విశేషం.

Bollywood divas who turned authors
సోహా అలీ ఖాన్

ట్వింకిల్​ ఖన్నా

సినీ కెరీర్​కు స్వస్తి పలికిన తర్వాత ట్వింకిల్​ ఖన్నా రచయిత్రిగా మంచి పేరు సంపాదించింది. పత్రికల్లో వ్యాసాలూ రాస్తుండేది. ఈమె రాసిన 'మిస్ట్రస్. ఫన్నీ బోన్స్'కు చాలా అవార్డులు కూడా వచ్చాయి. 'ది లెజెండ్ ఆఫ్​ లక్ష్మీ ప్రసాద్', 'పైజామాస్​ ఆర్​ ఫోర్జింగ్' పుస్తకాలను కూడా రాసింది ట్వింకిల్​.

Bollywood divas who turned authors
ట్వింకిల్ ఖన్నా

టిస్కా చోప్రా

ముంబయిలో అడుగు పెట్టే ప్రతి సినీ ప్రేమికుడు చదవాల్సిన పుస్తకం టిస్కా చోప్రా రాసిన 'యాక్టింగ్​ స్మార్ట్'. దీనికి మంచి ఆదరణ లభించింది. ఓ థ్రిల్లర్​ సినిమాకు కథ కూడా రాసిన ఈమె.. త్వరలోనే మరో బుక్ విడుదల చేసే ప్రయత్నంలో ఉంది.

Bollywood divas who turned authors
టిస్కా చోప్రా

కరిష్మా కపూర్

వ్యాపార వేత్తగా, నటిగా కరిష్మా కపూర్​ మంచి పేరు తెచ్చుకుంది. 'మై యమ్మీ మమ్మీ గైడ్' పుస్తకం రాసింది. గర్భంతో ఉన్నప్పుడు తాను ఎలాంటి సమస్యలు ఎదుర్కొందో ఇందులో వివరించింది. పిల్లల్ని పెంచే క్రమంలో తను బరువు ఎలా తగ్గిందో కూడా ఇందులో సవివరంగా రాసింది.

Bollywood divas who turned authors
కరిష్మా కపూర్

తాహిరా కశ్యప్

బాలీవుడ్​ నటి కాకపోయినా తాహిరా కశ్యప్ మంచి పేరు సంపాందించింది. ఆయుష్మాన్​ ఖురానా సతీమణిగానే కాక మంచి రచయిత్రిగా ఈమె పేరు తెచ్చుకుంది. 'ది 12 కమాండెంట్స్​ ఆఫ్ బీయింగ్ ఎ ఉమెన్' పుస్తకాన్ని ఇటీవలే రాసింది. ఈమె మొదటి పుస్తకం 'ఐ ప్రామిస్'. ఇది మార్కెట్లో బాగా అమ్ముడుపోయింది. తన భర్త జీవిత చరిత్ర ఆధారంగా రాసిన 'క్రాకింగ్ కోడ్: మై జర్నీ ఇన్​ బాలీవుడ్' పుస్తకంలో రచయిత్రిగా పాలు పంచుకుంది తాహిరా.

Bollywood divas who turned authors
తాహిరా కష్యప్

ఇదీ చదవండి:'అమలాపాల్‌ ప్రైవేట్‌ ఫొటోలు షేర్‌ చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.