ETV Bharat / sitara

కరోనా అవగాహనపై మేనకోడలు విద్యాతో మనోజ్ పాట

కరోనా కట్టడిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, హీరో మంచు మనోజ్ ఓ పాట రూపొందించాడు. దీనిని మంత్రి కేటీఆర్ ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

కరోనా అవగాహనపై మేనకోడలు విద్యాతో మనోజ్ పాట
మేనకోడలు విద్యా నిర్వాణతో మనోజ్
author img

By

Published : Apr 19, 2020, 5:59 PM IST

కరోనా వల్ల దేవుళ్లే క్వారంటైన్ పాటిస్తుంటే... ఆ దేవుళ్ల రూపంలో ప్రజలను ఆదుకునేందుకు వచ్చిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రైతులకు సహకరించాలని యువహీరో మంచు మనోజ్ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ వైరస్​పై అవగాహన పెంచేందుకు, తనవంతు బాధ్యతగా 'అంతా బాగుంటాం రా' అనే ప్రత్యేక గీతాన్ని రూపొందించాడు. మేనకోడలు విద్యా నిర్వాణతో కలిసి స్వయంగా ఆలపించాడు. ఈ పాటను మంత్రి కేటీఆర్ ట్విట్టర్​ ద్వారా విడుదల చేశారు.

ఈ చీకటి ఇలాగే ఉండిపోదని, మళ్లీ వెలుగు వస్తుందన్న గొప్ప ఆత్మస్థైర్యం నింపేలా పాటను అందించిన మనోజ్ బృందాన్ని కేటీఆర్ అభినందించారు. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అచ్చు సంగీతాన్ని అందించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.