మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న చిత్రం 'మామాంగం'. 17వ శతాబ్దంలో కేరళలో జరిగిన ఓ నిజజీవిత కథతో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రాచీన యుద్ధవిద్య కలరిపట్టును పూర్తిస్థాయిలో చూపించబోతున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.
'ఒక్కసారి చూస్తే మరువలేని దృశ్యం.. జగమెరుగని ఏకైక ఘట్టం.. కళ్లు విప్పార్చి చూడండి మామాంగ మహోత్సవం', 'మన సంప్రదాయం బానిసలా బతుకుతూ చావడం కాదు, ఓ గొప్ప చేవర్లా వీరమరణం పొందడం', 'ఊహకందని వేగం.. అసాధారణ వాయు విన్యాసాలు.. మన చరిత్రలో మునుపెన్నడూ తనలాంటి యోధుడు లేడు, ఇకరాడు' అనే డైలాగ్‌లు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, ప్రాచీ తెహ్లాన్, సిద్ధిఖ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జయచంద్రన్ సంగీతమందిస్తున్నాడు. పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే నెల 21న మలయాళం, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: మంచి మనసున్న మలయాళ మెగాస్టార్