ETV Bharat / sitara

ఆసక్తికరంగా 'మాస్ట్రో' ట్రైలర్‌.. 'పుష్ప' అదిరే అప్​డేట్ - సుకుమార్

అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రం నుంచి మరో అప్​డేట్ వచ్చింది. అలాగే నితిన్ 'మాస్ట్రో' చిత్ర ట్రైలర్​ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Maestro trailer
Allu Arjun
author img

By

Published : Aug 23, 2021, 7:19 PM IST

నితిన్‌, నభా నటేశ్‌ జంటగా రూపొందిన చిత్రం 'మాస్ట్రో'. ప్రముఖ నాయిక తమన్నా కీలక పాత్ర పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. 'కళ్లు కనపడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు' అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరిస్తోంది. అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నభా నటేశ్‌, తమన్నా తమ అందంతో, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. 'నువ్వు ప్లే చేసిన ట్యూన్‌ చాలా బాగుంది అరుణ్‌' అని నభా చెప్పగానే 'బట్‌, సమ్‌థింగ్‌ ఈజ్‌ మిస్సింగ్‌' అంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు నితిన్‌. క్రైమ్‌ సన్నివేశాలు ఉత్కంఠగా సాగాయి. మహతి స్వర సాగర్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రం హిందీలో విజయవంతమైన 'అంధాధున్‌' రీమేక్‌గా రూపొందింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. కథానాయకుడిగా నితిన్‌కిది 30వ చిత్రం.

'పుష్ప' నుంచి అప్​డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ నటిస్తున్న 'పుష్ప' చిత్రం నుంచి మరో అప్​డేట్ వచ్చింది. కన్నడ నటుడు ధనంజయక పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో అతడు జాలీ రెడ్డిగా నటించనున్నట్లు వెల్లడించింది.

ఎర్ర చందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమా ఫస్ట్​ పార్ట్​ను క్రిస్మస్​ కానుకగా డిసెంబరులో విడుదల చేయనున్నారు. సుకుమార్​ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్​ మేకర్స్​ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. దేవీశ్రీప్రసాద్​ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి: లంగా ఓణీలో నభా.. చీరతో మాయ చేస్తోన్న ఈషా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.