ETV Bharat / sitara

Oscar 2022: 'కూళాంగల్‌' సింపుల్‌గా తీస్తే.. ఆస్కార్‌ పోటీకి వెళ్లింది!' - oscar 2022 nominations

'కూళాంగల్‌'ను నిజాయతీగా, సింపుల్‌గా చిత్రీకరించినట్లు ఆ సినిమా దర్శకుడు పీఎస్​ వినోద్​రాజ్​ తెలిపారు. ఈ చిత్రాన్ని తన వ్యక్తిగత అనుభవం ఆధారంగా తీసినట్లు పేర్కొన్నారు. భారత్​ తరఫున ఆస్కార్-2022 పోటీలో(Oscar 2022 nominations) ఈ సినిమా నిలిచిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వినోద్​రాజ్​ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Koozhangal director PS Vinothraj
కూళాంగల్‌ దర్శకుడు పీఎస్‌ వినోద్‌రాజ్‌
author img

By

Published : Oct 27, 2021, 1:02 PM IST

ఆస్కార్‌.. యావత్‌ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు. ఈ అవార్డుని స్వీకరించాలని సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కలలు కంటారు. ఈసారి మన భారతదేశం తరఫున ఆస్కార్-2022 పోటీలో(Oscar 2022 nominations) నిలవడానికి తమిళ చిత్రం 'కూళాంగల్‌'(Koozhangal movie updates ) ఎంపికైంది. హిందీలో విడుదలైన 'సర్దార్‌ ఉద్దామ్‌', 'షేర్నీ' చిత్రాలను వెనక్కి నెట్టి 'కూళాంగల్' దేశం తరఫున ఆస్కార్‌కు ఇండియా నుంచి అధికారికంగా ఎంట్రీ సాధించింది. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పీఎస్‌ వినోద్‌రాజ్‌కు.. దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం మరో విశేషం. తొలి అడుగుతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై వినోద్‌రాజ్ ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో.. పలు విషయాలు చెప్పుకొచ్చారు.

అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది..

"చాలా భావోద్వేగానికి గురవుతున్నా. మూడేళ్ల ప్రయత్నం ఇప్పుడు ఫలించింది. 'కూళాంగల్‌' సినిమా ఈ స్థాయిలో గుర్తింపు పొందుతుందని, అంతర్జాతీయ, జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తారని మేము ఏనాడూ ఊహించలేదు. నిజాయతీగా, సింపుల్‌గా దీన్ని చిత్రీకరించాం. నాతో పాటు మా టీమ్‌ అంతా ఉత్సాహంగా ఉన్నాం. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. తుది జాబితాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం"

Koozhangal director PS Vinothraj
కూళాంగల్‌ దర్శకుడు పీఎస్‌ వినోద్‌రాజ్‌

అలా సినిమాలపై ప్రేమ పుట్టింది

"తమిళనాడులోని మధురై జిల్లా మేలూరు పట్టణం మాది. సినిమాలపై నాకు ప్రేమ పుట్టడానికి ఓ కారణం.. మేలూరులో ఎన్నో చిత్రాల షూటింగ్‌లు జరిగేవి. ఆ సినిమా సెట్స్‌ని చూడటం మొదలుపెట్టాక నాకు సినిమాలపై ఆసక్తి కలిగింది. అప్పుడే ఎలాగైనా సినిమాటోగ్రాఫర్‌ అవ్వాలని నిశ్చయించుకున్నా. దర్శకులు మాజిద్‌ మాజిది, స్టాన్లీ కుబ్రిక్ తెరకెక్కించిన చిత్రాలు చూశాక.. స్వచ్ఛమైన సినిమా అంటే ఏమిటో నాకు అర్థమైంది. అందుకే వారి సినిమాలను ఎక్కువగా చూస్తుంటాను"

koozhangal movie updates
కూళాంగల్​ చిత్ర బృందం

డీవీడీ షాపులో పనిచేశా

"కష్టాల కారణంగా.. చిన్న వయసు నుంచే పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. రకరకాల పనులు చేస్తూ జీవితం నెట్టుకొచ్చా. చెన్నైలోని ఓ డీవీడీ షాపులో సేల్స్‌ బాయ్‌గా పనిచేశా. అదే నన్ను సినిమా ప్రపంచానికి దగ్గర చేసింది. డీవీడీ షాపులో పనిచేసేటప్పుడు సినీ పరిశ్రమకు చెందిన కొందరితోనైనా పరిచయాలు ఏర్పడతాయని భావించా. అలా తమిళ దర్శకుడు సర్గుణం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్ని సినిమాలకు పనిచేశా. ఆ తరువాత 'కూళాంగల్‌' స్క్రిప్ట్‌ రాయడం ప్రారంభించా"

ఓ పక్క వేడిసెగలు.. మండుటెండ.. అయినాసరే!

"2019 మే.. మండుటెండల్లో మేలూర్‌లోని అరితపట్టి అనే గ్రామంలో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. ఈ కథకు లొకేషన్స్‌, వేసవిలో చిత్రీకరించడమే కీలకంగా నిలిచాయి. ఇందులో కీలకమైనవి కొడుకు, తండ్రి, ప్రకృతి. ఆ గ్రామంలో నీటికి లోటుండదు. వ్యవసాయం చేస్తూ ప్రశాంత జీవనాన్ని సాగిస్తున్న ఆ కుటుంబంలో కరవు వల్ల ఒక్కసారిగా మార్పులు వస్తాయి. ఓ వైపు కరవు, మరోవైపు ఆ కుటుంబం ఎదుర్కొన్న సంఘటనలు ఈ చిత్రంలో ప్రధానంగా చూపించాలనుకున్నాం. కరవు ఉన్న ప్రాంతాల్లోనే షూట్‌ చేశాం. తీవ్రమైన ఎండకారణంగా కెమెరా లెన్స్‌ సరిగా పనిచేసేవి కావు. కొన్నిసార్లు చెప్పులు లేకుండా షూట్‌ చేయాల్సి వచ్చేది"

koozhangal movie updates
కూళాంగల్​ చిత్ర బృందం

చివరికి నయనతార, విఘ్నేశ్‌ శివన్‌కి కథ నచ్చడంతో..

"కరోనా/లాక్‌డౌన్‌ కన్నా ముందే దాదాపు చిత్రీకరణ పూర్తయింది. 'తాంగా మీంగల్' చిత్రానికి గానూ జాతీయ అవార్డు దక్కించుకున్న దర్శకుడు రామ్‌ని కలిసి మా చిత్రం గురించి చెప్పాం. ఆయనికి మా పనితీరు, సినిమా తెరక్కెకించిన విధానం నచ్చింది. హీరోయిన్‌ నయనతార, నిర్మాత విఘ్నేష్‌ శివన్ కూడా మా చిత్రాన్ని చూశారు. అనంతరం వారే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు" అని దర్శకుడు వినోద్‌రాజ్‌ చెప్పారు.

వ్యక్తిగత అనుభవాల ఆధారంగానే..

ఈ చిత్రాన్ని తన వ్యక్తిగత అనుభవం నుంచే తీసినట్లు దర్శకుడు వినోద్‌రాజ్‌ చెప్పారు. గతంలో తన సోదరి, ఆమె భర్త మధ్య గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయలుదేరి తల్లిగారింటికి చేరుతుంది. దీంతో భార్యను వెతుక్కుంటూ భర్త ఆమె ఇంటికి చేరుకుంటాడు. దీని ఆధారంగానే కథను తీర్చిదిద్దినట్లు దర్శకుడు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.