కరోనా ప్రభావంతో మలయాళ ఇండస్ట్రీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు కేరళ నిర్మాతలు. అందులో భాగంగానే ప్రస్తుతం తీస్తున్న సినిమాల బడ్జెట్లో 50 శాతం కోత విధిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించారు.
"ఇండస్ట్రీలోని 'అమ్మ'(నటీనటుల సంఘం), 'ఫెఫ్కా'(ఇతర సిబ్బంది సంఘం)లతో చర్చించి, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తాం. మాలీవుడ్ నిలదొక్కుకోవాలంటే మాకు నిర్మాణ వ్యయంలో కోత విధించడం తప్ప వేరే దారికనబడట్లేదు" -రంజిత్, కేరళ నిర్మాతల సంఘ అధ్యక్షుడు
ప్రాణాంతక కరోనా వల్ల మలయాళంలో 10 సినిమాలకు విడుదల కాకుండా ఆగిపోయాయి. రెండు డజన్లకు పైగా చిత్రాల నిర్మాణనంతర కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోయాయి.
ఇవీ చదవండి: