సూపర్‌స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం 'దర్బార్' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తన 168వ సినిమాను దర్శకుడు శివతో చేయనున్నాడు. ఇందుకోసం భారీ తారాగణం సిద్ధం చేస్తున్నారట. తలైవా పక్కన హీరోయిన్లుగా మీనా, ఖుష్బూ నటించనున్నారని సమాచారం. వీరితో పాటే కథానాయిక కీర్తి సురేశ్‌ను రజనీ కూతురి పాత్ర కోసం ఎంపిక చేశారట. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
![SUPERSTAR 168 MOVIE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5270291_rajni-new-cinema.jpg)
'దర్బార్'లో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారిగా రజనీకాంత్ నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10 ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">