ETV Bharat / sitara

Corona Bollywood: హీరో జాన్ అబ్రహం, అతడి భార్యకు కరోనా - cinema news

John abraham covid: హిందీ హీరో జాన్ అబ్రహం, అతడి భార్య కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

John Abraham Priya Runchal
జాన్ అబ్రహం ప్రియ
author img

By

Published : Jan 3, 2022, 9:30 AM IST

John abraham news: దేశంలో మళ్లీ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు ఈ వైరస్​ బారిన పడుతున్నారు. బాలీవుడ్​లో ఇప్పటికే కరీనా కపూర్, అర్జున్​కపూర్, సన్యా కపూర్ తదితరులు తమకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయిందని చెప్పారు. ఇప్పుడు కథానాయకుడు జాన్ అబ్రహంతో పాటు అతడి భార్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడు ఇన్​స్టా వేదికగా వెల్లడించారు.

మూడురోజుల క్రితం తాను ఓ వ్యక్తిని కలిశానని, అతడికి పాజిటివ్​గా తేలడం వల్ల తాను, భార్య ప్రియ వైద్య పరీక్షలు చేసుకున్నామని జాన్ అబ్రహం తెలిపారు. తామిద్దరికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నామని చెప్పారు. అభిమానులందరూ మాస్క్​లు ధరించి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

John Abraham Covid-19 positive
జాన్ అబ్రహం ఇన్​స్టా స్టోరీ

జాన్ అబ్రహం నటించిన 'సత్యమేవ జయతే 2'.. జనవరి 25న విడుదల కావాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందా రాదా? అనేది చూడాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.