నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన 'జెర్సీ' మూవీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. త్వరలో కెనడా రాజధాని టొరంటోలో జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్-2020లో ప్రదర్శించేందుకు ఈ చిత్రం ఎంపికైంది. ఇది తమకు ఎంతో గర్వకారణమని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఆగస్టు 9, 2020 నుంచి ఆగస్టు 15, 2020 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన 'జెర్సీ' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. అనిరుధ్ రవిచంద్రన్ బాణీలను అందించారు. 2019 ఏప్రిల్‌లో విడుదలైన సినిమా మంచి హిట్ అందుకుంది. విమర్శకులనూ మెప్పించిన 'జెర్సీ' త్వరలో బాలీవుడ్‌లోనూ రీమేక్ చేయబోతున్నారు. క్లాసిక్ కేటగిరీలో ఈ చిత్రం ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">