ETV Bharat / sitara

విరాళాల కోసం నగ్నచిత్రం వేలం వేసిన నటి

author img

By

Published : Jun 4, 2020, 1:54 PM IST

కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు వినూత్న ప్రయత్నం చేసింది హాలీవుడ్​ నటి జెన్నిఫర్​ అనిస్టన్. తన నగ్న చిత్రాలను ఆన్​లైన్​ వేదికగా అమ్మకానికి పెట్టింది.

Jennifer auctions off her nude portrait to raise COVID-19 funds
విరాళాల కోసం నగ్నచిత్రం వేలం వేసిన నటి

కరోనా వైరస్​ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది హాలీవుడ్​ నటి జెన్నిఫర్​ అనిస్టన్. 1995లో మార్క్​ సెలిగర్​ అనే ఫొటోగ్రాఫర్​ తీసిన తన నగ్న ఫొటోలను అమ్మకానికి పెట్టింది. 25 ఏళ్ల వయసులో తీసుకున్న చిత్రాలను కరోనా విరాళల కోసం విక్రయానికి పెట్టినట్లు ఆ నటి వెల్లడించింది.

Jennifer
జెన్నిఫర్​ అనిస్టన్

ఆ ఫొటోలను కొను క్కునే విధానాన్ని ఇన్​స్టా వేదికగా పంచుకుంది అనిస్టన్. ఈ విధంగా సేకరించిన నిధులను అమెరికాలోని కరోనా వైద్య పరీక్షలు, చికిత్సలను ఉచితంగా అందిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నట్లు తెలిపింది.

51 ఏళ్ల ఈ జెన్నిఫర్ 2000 సంవత్సరంలో హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌ పిట్‌ను పెళ్లాడింది. కానీ వీరి వివాహ బంధం పట్టుమని పదేళ్లు కూడా నిలవలేదు. 2005లోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బ్రాడ్‌పిట్‌.. నటి ఏంజెలినా జోలీని వివాహం చేసుకున్నాడు.

ఇదీ చూడండి: జెన్నిఫర్​ అనిస్టన్​ను చంపమని నిర్మాత మెయిల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.