ETV Bharat / sitara

'మీరు శూన్యంలోనూ నన్ను ముందుకు నడిపిస్తారు' - జాన్వీ కపూర్ శ్రీదేవి

అందాల నాయిక శ్రీదేవి కన్నుమూసి మూడేళ్లవుతోంది. ఈ సందర్భంగా బోనీ కపూర్ తన కూతుళ్లతో కలిసి చెన్నైలోని మైలాపూర్​లో ఆమె జ్ఞాపకార్థం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Janvy Kapoor about Sridevi
జాన్వీ కపూర్
author img

By

Published : Feb 24, 2021, 8:36 PM IST

అందాల నాయిక శ్రీదేవి కన్నుమూసి, చూస్తుండగానే మూడేళ్లు గడిచాయి. ఆమె మరణించి మూడేళ్లయిన సందర్భంగా బోనీ కపూర్‌ తన కూతుళ్లతో కలిసి చెన్నైలోని మైలాపూర్‌ నివాసంలో ఈరోజు ఆమె జ్ఞాపకార్థం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీదేవి 2018 దుబాయ్‌లో బోనీకపూర్‌ మేనల్లుడు మోహిత్‌ మార్వా పెళ్లికి హాజరై, ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగిపోయి కన్నుమూశారు. కొద్ది రోజుల తర్వాత జాన్వీ కపూర్‌ తన తల్లి గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ.. "నా హృదయంలో ఆమెకు పవిత్ర స్థానం ఉంది. ఇకపై నేను జీవించడం కొత్తగా నేర్చుకోవలసి ఉంటుంది. ఈ శూన్యంలోనూ మీరు నన్ను ముందుకు నడిపిస్తారు. నేను కళ్లు మాసుకున్న ప్రతిసారీ మీరు చెప్పిన మంచి విషయాలు మాత్రమే నాకు గుర్తుకొస్తున్నాయి. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ కలిగి ఉంటాం. చాలా స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉన్నారు. మీరు ఈ ప్రపంచం కోసం ఉన్నారు. అందుకే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్లారు" అంటూ పేర్కొంది.

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ రాజ్‌ కుమార్‌ రావ్‌, వరుణ్‌ శర్మలతో కలిసి 'రూహీ' చిత్రంతో పాటు 'గుడ్‌ లక్‌ జెర్రీ', 'దోస్తానా 2'లోనూ నాయికగా నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.