బాలీవుడ్ నటి జాన్వీకపూర్, ఇప్పుడంటే హీరోయిన్ అయిపోయింది. సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే తన పాఠశాల రోజుల్లో మాత్రం తెగ అల్లరి చేసేది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అవడం వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ వీడియోలో స్కూల్ దుస్తుల్లో ఉన్న జాన్వీ.. ఓ స్నేహితుడితో కలిసి కొబ్బరి బొండంలోని నీళ్లు తాగుతూ కనిపించింది. అప్పుడు ముక్కుతో ఓ విధమైన శబ్దం చేస్తూ అల్లరి చేసింది. ఇందులో వీరిద్దరూ నవ్వుతూ కనిపించారు. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ ప్రస్తుతం.. 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్', హీరో కార్తిక్ ఆర్యన్‌తో 'దోస్తానా 2'లో నటిస్తోంది.
ఇదీ చూడండి : టాలీవుడ్లో యాస లెస్సగా పలుకుతోంది