ETV Bharat / sitara

సాయిధరమ్​ తేజ్​ను పరామర్శించిన హీరో అల్లుఅర్జున్​ - saidharam tej alluarjun

రోడ్డు ప్రమాదానికి గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగాహీరో సాయి ధరమ్​ తేజ్​ను(sai dharam tej accident) హీరో అల్లు అర్జున్​ పరామర్శించారు. అంతకుముందు మెగాఫ్యామిలీతో పాటు పలువురు నటులు కూడా హాస్పిటల్​కు వచ్చారు.

Allu Arjun visits Apollo Hospitals
సాయిధరమ్​ తేజ్​ను పరామర్శించిన హీరో అల్లుఅర్జున్​
author img

By

Published : Sep 16, 2021, 6:08 PM IST

Updated : Sep 16, 2021, 7:11 PM IST

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు సాయి ధరమ్​ తేజ్​ను(sai dharam tej accident) పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం(సెప్టెంబరు 16) తేజ్​ను పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లారు హీరో అల్లుఅర్జున్​(allu arjun sai dharam tej). బన్నీ రాకతో హాస్పిటల్​ వాతావరణం అభిమానులతో నిండిపోయింది.

Allu Arjun visits Apollo Hospitals
సాయిధరమ్​ తేజ్​ను పరామర్శించిన హీరో అల్లుఅర్జున్​

అంతకుముందు మెగాస్టార్​ చిరంజీవి దంపతులు, పవన్​కల్యాణ్​, నటుడు రామ్ చరణ్, ఉపాసన కామినేని, నిహారిక సహా పలువురు మెగా కుటుంబ సభ్యులు సాయి తేజ్​ను చూడటానికి వచ్చారు. నటులు రాశిఖన్నా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కూడా ఆస్పత్రికి వచ్చారు.

తేజ్(sai dharam tej health condition) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఇటీవల వైద్యులు తెలిపారు. హైదరాబాద్​లోని కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్​ బైక్​పై వెళ్తున్న క్రమంలో జారిపడటం వల్ల తేజ్​కు కన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. తొలుత మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలోకు మార్చి సాయికి శస్త్రచికిత్స చేశారు.

ఇదీ చూడండి: సాయిధరమ్​ తేజ్​ను పరామర్శించిన సినీప్రముఖులు

Last Updated : Sep 16, 2021, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.