ఈ ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
హీరో సాయిధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం - సాయితేజ్ రిపబ్లిక్ మూవీ
01:18 September 11
కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు
01:06 September 11
24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో..
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యస్థితిపై అపోలో వైద్యులు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు.. అతడిని 24 గంటల పాటు పర్యవేక్షిస్తామని తెలిపారు. కాలర్ బోన్ వద్ద గాయం మినహా అంతర్గత గాయాలు ఏవీ కాలేదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం తేజ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు.
01:01 September 11
'ఆరోగ్యం నిలకడగానే ఉంది'
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదని అల్లు అరవింద్ వెల్లడించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారని స్పష్టం చేశారు.
21:45 September 10
తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
మెగాహీరో సాయిధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న క్రమంలో జారిపడటం వల్ల అతడికి కన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. దీంతో సమీపంలోని మాదాపుర్ మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు.
ఐకియా కూడలి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి సాయిధరమ్ తేజ్ కిందపడ్డారు. గచ్చిబౌలి నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇతడు హీరోగా నటించిన 'రిపబ్లిక్' అక్టోబరు 1న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.
ఆస్పత్రికి చిరంజీవి, పవన్
సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు చెప్పారు. మెడికవర్ ఆస్పత్రికి సాయిధరమ్ తేజ్ కుటుంబసభ్యులు చేరుకున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్ ఆస్పత్రికి చేరుకొని తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అపోలో ఆస్పత్రికి తరలింపు
సాయిధరమ్ తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనాస్థలంలో ఇసుక ఉండడంతో బైక్ స్కిడ్ అయినట్లు మాదాపూర్ ఏసీపీ చెప్పుకొచ్చారు.