ETV Bharat / sitara

చెర్రీ ఉదారత.. ఉక్రెయిన్​లోని సెక్యూరిటీ గార్డుకు ఆర్థిక సాయం - రామ్​చరణ్​ సెక్యూరిటీ గార్డు

Hero Ramcharan Ukraine Security: మెగా పవర్​స్టార్​ హీరో రామ్​చరణ్​ ఉదారతను చాటారు. ఉక్రెయిన్​లో ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​లో తనకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన రస్టీ అనే ఆర్టిస్ట్​కు ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు తమను ఆదుకున్న చరణ్​కు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపాడు రస్టీ.

ఉక్రెయిన్ సెక్యూరిటీ గార్డు
రామ్​చరణ్​
author img

By

Published : Mar 18, 2022, 8:43 PM IST

చెర్రీ ఉదారత.. ఉక్రెయిన్​ సెక్యూరిటీ గార్డుకు ఆర్థిక సాయం

Hero Ramcharan Ukraine Security: ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో హీరో రామ్​చరణ్​ తన ఉదారతను చాటుకున్నారు. ఉక్రెయిన్​లో ఆర్​ఆర్ఆర్​ చిత్రీకరణ సమయంలో వ్యక్తిగత గార్డ్​గా పనిచేసిన ఉక్రెయిన్​కు చెందిన రస్టీకు చరణ్​ అండగా నిలిచారు. యుద్ధం మొదలైన తర్వాత రస్టీ కుటుంబసభ్యుల యోగక్షేమాలపై ఆరా తీశాడు చెర్రీ. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా రస్టీ భార్య ఖాతాలో కొంత నగదును జమ చేశారు.

ఈ నేపథ్యంలో రస్టీ.. మానవతా దృక్పథంతో ఆదుకున్న రామ్​చరణ్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వీడియోను పోస్టు చేశాడు. చరణ్​ ఇచ్చిన డబ్బులతో మందులు, ఇతర వస్తువులను కొనుక్కున్నామని రస్టీ తెలిపాడు. క్లిష్ట సమయంలో తమను గుర్తించి ఆదుకున్న రామ్​చరణ్​కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు.

రాజమౌళి దర్శకత్వంలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ నటించిన 'ఆర్ఆర్​ఆర్'​ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రంలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్​ వేగం పెంచుతోంది. కొంచెం కూడా ఖాళీ లేకుండా బిజీగా గడుపుతోంది.

ఈ క్రమంలోనే మరోసారి ఆర్ఆర్ఆర్ ప్రచారాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు దర్శకుడు రాజమౌళి ప్రణాళిక సిద్ధం చేసి 'మారాథాన్​ ప్రమోషనల్​ క్యాంపైన్' చేయనున్నారు. శుక్రవారం(మార్చి 18) నుంచి​ వరుసగా తొమ్మిది నగరాల్లో మూవీటీం ప్రచారం నిర్వహించనుంది.

ఇదీ చదవండి: 'త్వరలోనే తెలుగులోకి 'ది కశ్మీర్​ ఫైల్స్​ చిత్రం''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.