ETV Bharat / sitara

Green India Challenge: కేబీఆర్​ పార్క్​లో మొక్కలు నాటిన దుల్కర్​ సల్మాన్​

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌(Green India Challenge)లో భాగంగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ (hero Dulquer Salmaan) మొక్కను నాటారు. సినీ నటి అదితి రావు హైదరి విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన దుల్కర్... హైదరాబాద్‌లోని కేబీఆర్​ పార్కులో మొక్కను నాటారు.

Dulquer
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో దుల్కర్​
author img

By

Published : Nov 10, 2021, 1:12 PM IST

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​(Green India Challenge)ను ఆరంభించిన ఎంపీ సంతోష్​ కుమార్​కు యువ కథానాయకుడు దుల్కర్​ సల్మాన్​ (hero Dulquer Salmaan) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హరిత సవాల్​లో భాగంగా కథానాయిక అదితిరావు సవాల్​ విసిరారు. ఛాలెంజ్​ను స్వీకరించిన దుల్కర్​ హైదరాబాద్​ కేబీఆర్​ పార్క్​లో మొక్కలు నాటారు. తన వంతు బాధ్యతను చాటుకున్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో దుల్కర్​

తన తాజా చిత్రం కురుప్​ ప్రచారం నిమిత్తం హైదరాబాద్​కు వచ్చిన దుల్కర్​... గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ విషయాన్ని గుర్తుచేసుకుని కేబీఆర్​ పార్క్​కు వెళ్లి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్న దుల్కర్‌... ప్రతి ఒక్కరు ఈ సవాల్‌ను స్వీకరించాలని పిలుపునిచ్చారు.

హరిత తెలంగాణ దిశగా ఎంపీ సంతోశ్​ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో​ ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​ ప్రముఖులు, క్రీడాకారులు భాగస్వాములయ్యారు. ఈ ఛాలెంజ్​లో భాగంగా... ఇప్పటికే 16 కోట్లకు పైగా మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రజలు పండగలా జరుపుకునే ఏ సందర్భం వచ్చినా.. అందులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాగం చేస్తూ ఎంపీ సంతోష్​ హరిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు.

ఇందులో భాగంగానే.. దసరా పండుగకు ప్రతీ ఊరు, దేవాలయంలో జమ్మి చెట్టు నాటేలా ప్రణాళిక రచించారు. అందుకోసం ఇప్పటికే స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. హరిత తెలంగాణతో పాటు భవిష్యత్​ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించటమే లక్ష్యంగా గ్రీన్​ఇండియా ఛాలెంజ్​ను కొనసాగిస్తున్నట్టు ఎంపీ సంతోష్​ తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.