ETV Bharat / sitara

'గుర్తుందా శీతాకాలం' విడుదల తేదీ ఖరారు

author img

By

Published : Dec 7, 2020, 10:16 AM IST

నటుడు సత్యదేవ్​, హీరోయిన్​ తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'గుర్తుందా శీతాకాలం' సినిమా ఏప్రిల్​ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం
gurtunda sitakalam
గుర్తుందా శీతాకాలం

అగ్ర కథానాయిక తమన్నా, నటుడు సత్యదేవ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. ఏప్రిల్​ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల కర్ణాటకలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందీ చిత్రం. రెండో షెడ్యూల్లో సెట్​లోకి తమన్నా అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ సినిమా విశేషాలను వెల్లడించింది చిత్ర యూనిట్. జనవరి నెలాఖరు వరకు తదుపరి షెడ్యూల్ పూర్తి చేసి ఏప్రిల్ 1న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

కన్నడలో విజయవంతమైన 'లవ్ మాక్​టేల్' చిత్రానికి రిమేక్​గా తెరకెక్కుతోందీ చిత్రం. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించగా.. లక్ష్మీభూపాల్ సంభాషణలు రాస్తున్నారు.

ఇదీ చూడండి : క్లాస్​లుక్​లో సత్యదేవ్​.. టైగర్​ ష్రాఫ్​ స్టంట్స్​​ అదుర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.