మహారాష్ట్ర ప్రభుత్వం తనను జైలులో పెట్టాలనే ఉద్దేశంతో ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్లు చేస్తోందని నమోదైన ఫిర్యాదు మేరకు, ముంబయి పోలీసులు ఈమెకు సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలోనే కంగన ట్వీట్ చేసింది.
"సావర్కర్, నేతా బోస్, రాణి ఆఫ్ ఝాన్సీ లాంటి వ్యక్తులను నమ్ముతాను. కానీ ప్రభుత్వం మాత్రం నన్ను జైల్లో పెట్టాలని చూస్తోంది. అయితే నేను అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. జైహింద్" -కంగనా రనౌత్ ట్వీట్
ఇటీవలే బాంద్రా కోర్టులో ఈమెపై కేసు నమోదవగా, శుక్రవారం అంధేరీ కోర్టులో ఓ న్యాయవాది కంగనపై కేసు పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్లు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: