మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరుకు బంధువులైనా.. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా కలిసి పెరిగారు. ఇప్పుడు ఇద్దరూ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే, తాజాగా సాయి తేజ్ హెయిర్ స్టైల్‌పై వరుణ్ తమాషాగా కామెంట్ పెట్టాడు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా వరుణ్ తన చిన్నప్పటి ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో అతని పక్కన సాయి తేజ్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే సాయి చిన్ననాటి హెయిర్ స్టైల్ అంటే తనకెంతో ఇష్టమని సరదాగా రాసుకొచ్చాడు వరుణ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">