ETV Bharat / sitara

అక్కడ పేరొచ్చినా.. ఇక్కడ మాత్రం ఆడలేదు - Chatrak movie

సినిమాల్లో కమర్షియల్ హంగులు ఈరోజుల్లో సాధారణమే. కానీ ఓ చిత్రాన్ని విభిన్నమైన కథతో తెరకెక్కించాలంటే కాస్త ధైర్యం కావాలి. అలాంటి సాహసం చేసినా భారత్​లో ఆ చిత్రాలకు ఆదరణ దక్కేది మాత్రం అంతంతమాత్రమే. కానీ కొన్ని సినిమాలు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించాయి. అలాంటి చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

సినిమా
సినిమా
author img

By

Published : Jun 5, 2020, 2:19 PM IST

Updated : Jun 14, 2020, 7:35 PM IST

ఈరోజుల్లో సినిమా అంటే కమర్షియల్ అయిపోయింది. కానీ సామాజిక సమస్యల ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా.. దేశంలో మాత్రం అంతగా ఆదరణ దక్కలేదు. అలాంటి చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

పార్చ్​డ్-2015

ఈ సినిమాకు కథ రాసి దర్శకత్వం వహించారు లీలా యాదవ్. రాధికా ఆప్టే, సుర్విన్ చావ్లా కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్​​ నిర్మాతగా వ్యవహరించారు. నలుగురు గ్రామీణ మహిళలు వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేదే చిత్ర కథాంశం. అంతర్జాతీయంగా టొరంటో ఫిల్మ్​ ఫెస్టివల్​లో ప్రదర్శితమైందీ సినిమా.

పర్చ్​డ్
పర్చ్​డ్

ఛత్రక్-2011

ఇది ఒక బెంగాలీ చిత్రం. ఇందులో ఓ ప్రముఖ ఆర్కిటెక్ట్​, స్నేహితురాలితో కలిసి తప్పినపోయిన అతడి సోదరుడి కోసం వెతుకుతుంటాడు. చివరికి అతడు అరణ్యంలో నివసిస్తున్నాడని తెలుసుకుంటారు. అయితే ఈ చిత్రాన్ని కోల్​కతాలో ప్రదర్శించలేదు. కొన్ని అభ్యంతరకర సన్నివేశాల దృష్ట్యా నిరసనలు చెలరేగాయి. ఎన్నో ఫిల్మ్​ ఫెస్టివల్స్​లో ప్రదర్శితమైన ఈ చిత్రం కేన్స్​లోనూ మెరిసింది.

ఛత్రక్
ఛత్రక్

కోర్ట్-2014

71వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రదర్శించబడిందీ మరాఠీ చిత్రం. 19 ఫిల్మ్ ఫెస్టివల్​లో అవార్డులను దక్కించుకుంది. 2014లో జరిగిన 62వ జాతీయ పురస్కారాల్లోనూ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్​ అవార్డు కైవసం చేసుకుంది. భారతీయ న్యాయవ్యవస్థలోని లోటుపాట్లను ఈ సినిమా ఎత్తిచూపింది.

కోర్ట్
కోర్ట్

జై భీమ్ కామ్రేడ్-2011

ముంబయిలోని దళిత ప్రజల జీవితాలు, రాజకీయాల గురించిన నేపథ్యంతో తెరకెక్కిందీ సినిమా. 1997లో జరిగిన రమాబాయ్​నగర్ మారణకాండ సమయంలో ప్రారంభరమైన ఈ సినిమా 14 ఏళ్ల తర్వాత 2011లో విడుదలైంది. అలాగే ముంబయి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్​లో ఉత్తమ చిత్రం/వీడియో పురస్కారం అందుకుంది. అలాగే జాతీయ పురస్కార వేడుక, హాంగ్​కాంగ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్, జీన్ రోచ్ ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రశంసలు దక్కించుకుంది.

జై భీమ్ కామ్రేడ్
జై భీమ్ కామ్రేడ్

సిటీస్ ఆఫ్ స్లీప్-2015

2015లో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ తైవాన్ ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రదర్శితమైంది. ఇద్దరు యాచకులు దిల్లీలోని వీధులు, కార్ గారేజ్​లు, సబ్​వేస్​ ఇలాంటి ప్రదర్శాల్లో నిద్రపోతూ జీవితం కొనసాగిస్తారు. ఇదే ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

సిటీస్ ఆఫ్ స్లీప్-
సిటీస్ ఆఫ్ స్లీప్-

లేబర్ ఆఫ్ లవ్-2014

2014లో తెరకెక్కిన ఈ చిత్రం జాతీయ ఉత్తమ బెంగాలీ చిత్రంగా పురస్కారం అందుకుంది. కోల్​కతాలోని నిరుద్యోగితను ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఓ యువజంట వేరు వేరు షిఫ్టుల్లో ఉద్యోగం చేస్తుంటారు. దీనికి ఆదిత్య విక్రమ్ సేన్​గుప్తా దర్శకత్వం వహించారు. 71వ వెనిస్ అంతర్జాతీయ పురస్కారాల్లో ప్రదర్శితమైన ఈ సినిమా ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డు సొంతం చేసుకుంది. అలాగే జాతీయ అవార్డుల వేడుకలో ఉత్తమ డెబుటెండ్ డైరెక్టర్​కు ఇచ్చే ఇందిరాగాంధీ పురస్కారాన్ని దక్కించుకుంది.

లేబర్ ఆఫ్ లవ్
లేబర్ ఆఫ్ లవ్

ఇన్​షాఅల్లా, ఫుట్​బాల్-2010

ఆస్కార్ నామినేటెడ్ దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో 18 ఏళ్ల భాషా​ అనే యువ ఫుట్​బాల్ ఆటగాడు తన తండ్రి ఓ మిలిటెంట్ అవడం వల్ల విదేశాలకు వెళ్లలేకపోతాడు. దీనికి అవసరమైన సెన్సార్ సర్టిఫికెట్ కూడా లభించలేదు. ఇందులో కశ్మీర్ అందాన్ని చక్కగా చూపించారు. ఈ సినిమా పుసాన్, దుబాయ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది.

ఇన్​షాఅల్లా, ఫుట్​బాల్
ఇన్​షాఅల్లా, ఫుట్​బాల్

లూసియా-2013

థియేటర్​లో పని చేసే ఓ వ్యక్తికి నిద్రపట్టదు. అందుకోసం ఓ ప్రత్యేకమైన మెడిసిన్ వాడతాడు. తర్వాత అతడు ఓ కలలోకి వెళతాడు. అనేది మంది నుంచి సేకరించిన డబ్బుల ద్వారా (క్రౌండ్ ఫండింగ్) ఈ కన్నడ సినిమాను తెరకెక్కించారు. లండన్​ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రదర్శితమై బెస్ట్ ఆడియన్స్​ ఛాయిస్ అవార్డు దక్కించుకుంది.

లూసియా
లూసియా

గండు-2010

ముంబయి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు వసన్ బాలా దర్శకత్వం వహించారు. నలుగురు యువకులు డ్రగ్​ ట్రేడ్​లో చిక్కుకుంటారు. వారిని ఓ పోలీసు ఎలా పట్టుకున్నాడనేదే సినిమా కథ. అయితే ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కానీ ఇంటర్నేషనల్​ క్రిటిక్స్​ ప్రశంసలు అందుకుంది.

గండు

Last Updated : Jun 14, 2020, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.