ప్రభాస్ 22వ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండనుందా? అందుకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి కన్నడ సినీ వర్గాలు.
కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా స్థాయి సినిమాల్ని తెరకెక్కించగల డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం కేజీఎఫ్ 2ను తీస్తున్నారు. దీని తర్వాత ఆయన తదుపరి చిత్రం తెలుగు కథానాయకులతోనే ఉండబోతోందనే మాట కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ - ప్రశాంత్ కలయికలో సినిమా కూడా ఖాయమైంది. అయితే ప్రభాస్‌తోనూ ప్రశాంత్‌నీల్ ఓ సినిమా చేయబోతున్నారని కన్నడ పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే సినిమా ఉండబోతోందని చెబుతున్నాయి. మాఫియా నేపథ్యంలో, పాన్ ఇండియా స్థాయిలోనే ఆ సినిమా రూపొందనుందని సమాచారం.
ఇది చూడండి రావు గోపాలరావు స్పెషల్ డైలాగ్స్ మీకోసం...