ETV Bharat / sitara

'కోబ్రా' టీజర్.. 'ఏ1 ఎక్స్​ప్రెస్', టక్​ జగదీష్ అప్​డేట్స్ - Nani Tuck jagadish release date

చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. అలాగే సందీప్ కిషన్ హాకీ ప్లేయర్​గా రూపొందుతున్న 'ఏ1 ఎక్స్​ప్రెస్' ఫస్ట్​లుక్ విడుదలైంది.​

Cobra teaser and A1 express firstlook released
సందీప్ కిషన్, విక్రమ్
author img

By

Published : Jan 9, 2021, 11:05 AM IST

Updated : Jan 9, 2021, 2:58 PM IST

సిక్స్​ప్యాక్​తో సందీప్

టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా హాకీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఏ1 ఎక్స్​ప్రెస్'.​ లావణ్య త్రిపాఠి హీరోయిన్​గా నటిస్తోన్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. సిక్స్​ప్యాక్​తో హాకీ ప్లేయర్​గా సందీప్ ఆకట్టుకుంటున్నారు.

అలరిస్తోన్న కోబ్రా

చియాన్ విక్రమ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'కోబ్రా'. ఈ సినిమాలో విక్రమ్ దాదాపు 25 పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్​తో పాటు టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్​లుక్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం. ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వేసవికి టక్ జగదీష్

వేసవిలో వినోదాలు పంచేందుకు తన 'టక్ జగదీష్' చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు నేచురల్​ స్టార్ నాని. ఆయన కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. సాహు గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

Tuck jagadish
టక్ జగదీష్ రిలీజ్ పోస్టర్

Last Updated : Jan 9, 2021, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.