ETV Bharat / sitara

CHIRANJEEVI: రూ.10 టిక్కెట్టుతో రూ.10 కోట్లు వసూళ్లు! - telugu movie news

కథానాయకుడిగా ఎంతోమంది అభిమానుల్ని అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 1992లో వచ్చిన 'ఘరానా మొగుడు' చిత్రంతో రికార్డు సృష్టించారు. రూ.10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. అప్పట్లో ఆ మార్క్​​ అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది.

Chiranjeevi Gharana mogudu movie collection record
చిరంజీవి
author img

By

Published : May 27, 2021, 6:31 PM IST

ఇప్పుడంటే సినిమాలు వందల వేలకోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తున్నాయి. కానీ కొన్నేళ్ల క్రితం వరకు టిక్కెట్టు రేటు తక్కువ ఉండటం వల్ల కోట్లలో సిిినిమా వసూళ్లు అంటే జనాలు ఆశ్చర్యంగా చూసేవారు. అలాంటి చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి 'ఘరానా మొగుడు' ఒకటి.

కమర్షియల్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరు సరసన నగ్మా, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు. కె.రాఘవేంద్రరావు తన దర్శకత్వ ప్రతిభతో మాస్ ఆడియన్స్​తో పాటు సాధారణ ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచారు. అయితే థియేటర్లలో కేవలం రూ.10 టికెట్లతో ఈ సినిమా దాదాపు రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అప్పట్లో దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది!

"ఇలాంటి సినిమా ఇప్పుడు చేయాలంటే రూ.30 కోట్లకు పైగా ఖర్చవుతుంది. అలానే చిరంజీవి లాంటి స్టామినా ఉన్న హీరో దొరకాలి. రూ.10 టిక్కెట్టు మీదు రూ.10 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు రూ.60 టిక్కెట్లు లెక్కన చూస్తే రూ.60 కోట్లు కలెక్షన్లు సాధించినట్లు లెక్క" అని గతంలో ఓసారి ఆ చిత్ర నిర్మాత దేవీవరప్రసాద్ చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.