బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) తొలి హిందీ సినిమాకు ముహుర్తపు కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. దీనికి ముఖ్యఅతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), ఆయన భార్య రమా రాజమౌళి విచ్చేశారు. స్క్రిప్ట్‌ను విజయేంద్రప్రసాద్ అందజేయగా.. రాజమౌళి క్లాప్ కొట్టారు. నిర్మాత ఏఎం.రత్నం తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన 'ఛత్రపతి' రీమేక్‌గా(Chatrapathi Remake) దీనిని తెరకెక్కిస్తున్నారు. వి.వి. వినాయక్(V. V. Vinayak) దర్శకత్వం వహిస్తుండగా, పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడా నిర్మిస్తున్నారు.
'బేబీ ఓ బేబీ' లిరికల్
నితిన్ 'మాస్ట్రో'(Maestro Movie) నుంచి తొలి లిరికల్ సాంగ్ వచ్చేసింది. 'బేబీ ఓ బేబీ'(Baby O Baby Maestro) అంటూ సాగుతున్న గీతాన్ని చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. హిందీ బ్లాక్‌బస్టర్ 'అంధాధున్' రీమేక్‌గా(Andhadhun Remake) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నభా నటేష్, తమన్నా కీలకపాత్రల్లో నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల తేదీపై స్పష్టత రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'డియర్ మేఘ' తొలిసాంగ్
మేఘా ఆకాశ్(Megha Akash) హీరోయిన్గా 'డియర్ మేఘ'(Dear Megha) అనే చిత్రం తెరకెక్కుతోంది. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలోని 'ఆమని ఉంటే' లిరికల్ సాంగ్‌ను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. 'అర్జున్‌రెడ్డి' పోరీ.. హాట్‌గా ఉందిరో వారీ!