ETV Bharat / sitara

'83' చిత్రం ఓ అద్భుతం.. ప్రముఖుల ప్రశంసలు - 83 rajnikanth praises

Ranveer singh 83 movie: రణ్​వీర్​ సింగ్​ ప్రధాన పాత్రలో వచ్చిన '83' సినిమా.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరీ ప్రశంసలను దక్కించుకుంటోంది. సూపర్​స్టార్​ రజనీకాంత్​, టెస్ట్​ క్రికెట్​ సారథి కోహ్లీ సహా పలువురు ప్రముఖులు చిత్రంపై ప్రశంసలను కురిపిస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే..

83 సినిమా, 83 movie
83 సినిమా
author img

By

Published : Dec 28, 2021, 10:03 PM IST

Updated : Dec 28, 2021, 10:15 PM IST

Ranveer singh 83 movie: చారిత్రాత్మక ఘట్టాలను తెరకెక్కించడమంటే మామూలు విషయం కాదు. దాని గురించి ఎంతో పరిశోధన చేయాలి. ఎవరి మనోభావాలను నొప్పించకుండా తీయాలి. అలాంటి ప్రయత్నమే చేసి విజయం సాధించారు '83' చిత్ర దర్శకుడు కబీర్‌ ఖాన్. 1983లో భారత్‌ క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ సాధించడం , కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌తో పాటు ఇతర క్రికెటర్లు ప్రదర్శించిన ఆటతీరు నేపథ్యంగా వచ్చిన చిత్రం '83'. ఈనెల 24న థియేటర్లలో విడుదలైంది. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌ కనిపించారు. అటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల మెప్పు పొందుతూ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

తాజాగా '83' చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ట్విటర్‌ వేదికగా ఆ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. "వావ్! అద్భుతమైన చిత్రం. కబీర్‌ ఖాన్‌, కపిల్‌ దేవ్‌, రణ్‌వీర్‌, జీవాతో పాటు చిత్రబృందానికి కంగ్రాట్స్‌" అంటూ ట్వీట్‌చేశారు. మరి ఇతర సెలబ్రెటీలు ఆ చిత్రం గురించి ఏమన్నారంటే..

"భారత క్రికెట్ చరిత్రలో అత్యద్భుతమైన క్షణాన్ని ఇంతకంటే మెరుగ్గా ఎవ్వరూ చూపించలేరేమో. 1983లో జరిగిన ప్రపంచ కప్ ఘట్టాలను భావోద్వేగాలతో అద్భుతంగా రూపొందించిన చలనచిత్రం '83'. అందరూ చక్కటి ప్రదర్శనిచ్చారు. కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌ డిఫరెంట్‌ లెవల్‌లో యాక్ట్‌ చేశాడు. కపిల్‌దేవ్‌, కబీర్‌ఖాన్‌తో పాటు టీమ్ అందరికి నా అభినందనలు"

- టీమ్‌ ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ

"భారతదేశ క్రీడా చరిత్రలో ఒక అద్భుత ఘట్టాన్ని '83' చిత్రం అందంగా తెరకెక్కించింది. దర్శకుడు కొత్త తరాలకు 1983ని మళ్లీ పునరుజ్జీవింపచేసేలా చేసినందుకు ధన్యవాదాలు. రణ్‌వీర్‌! నీ గురించి ప్రత్యేకించి ఏమి చెప్పను.. ఈ చిత్రంలో నీ నటన బాగుంది. ఒక్క ఫ్రేమ్‌లోనూ ఎలాంటి ఒక్క తప్పిదం కూడా లేదు."

- బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ

"ఇలాంటి చిత్రాన్ని అందించిన కబీర్‌ సర్‌కు ధన్యవాదాలు. మీ గురించి చాలా చెప్పాలని ఉంది కానీ మాటలు రావడం లేదు. ఇదొక సినిమా మాత్రమే కాదు. ఒక అనుభవం. ఇందులో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఒకే సమయంలో నాకు కన్నీళ్లు, ఆనందం వచ్చాయి. ఆనందం, ప్రేమ, ఐక్యత, స్నేహం, స్ఫూర్తి, గర్వం ఇవన్నీ మీకు '83'లో దొరుకుతాయి. ఈ సినిమా వీక్షించిన తరువాత భావోద్వేగంతో బయటికి వస్తారు."

- బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌

"83 చిత్రాన్ని చూశాను. అందులో నాకెక్కడా రణ్‌వీర్‌ కనిపించలేదు. స్క్రీన్‌ మీదంతా కపిల్‌దేవ్‌ కనిపించాడు. అంతలా రణ్‌వీర్‌ కపిల్‌గా ఒదిగిపోయాడు. కపిల్‌గా రణ్‌వీర్‌గా మారిన తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా చూస్తున్నట్టు కాకుండా 1983లో నిజంగానే స్టేడియంలో మ్యాచ్‌ వీక్షించినట్టు అనిపించింది. అంతటి అద్భుత నటన ప్రదర్శించారు."

- బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: సర్​ప్రైజ్​లతో 'భీమ్లానాయక్'​, 'లైగర్'​ సిద్ధం

Last Updated : Dec 28, 2021, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.