'అల వైకుంఠపురములో' సినిమాలోని బుట్టబొమ్మ లిరికల్ పాట విడుదలైంది. వినసొంపుగా ఉంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఈ గీతంలో 'ఈ లవ్ అనేది బబుల్గమ్.. అంటుకున్నాదంటే పోదు నమ్మూ' అంటూ సాగే లిరిక్స్ అలరిస్తున్నాయి.
సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, టబు, జైరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">