ETV Bharat / sitara

కరోనాపై చేసే యుద్ధంలో సైనికులు మీరే!

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు.. ప్రస్తుతం ఆ వైరస్​తో పోరాడుతున్న వారికి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు బాలీవుడ్ నటులు. ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో ప్రతిరక్షకాలు ఉన్నాయని బృహన్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ (బీఎంసీ) ఇటీవలే తెలిపింది. దీంతో రక్తం, ప్లాస్మా దానాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

author img

By

Published : Apr 20, 2020, 4:18 PM IST

bollywood actors appeal to COVID-19 survivors to donate blood and plasma to fight against virus
కరోనాపై చేసే యుద్ధంలో సైనికులు మీరే!

ప్రస్తుతం కరోనా​ నుంచి కోలుకున్న వ్యక్తులు.. వైరస్​ బారిన పడిన వారికి రక్తం, ప్లాస్మా దానం చేయాలని పలువురు బాలీవుడ్ హీరోలు సూచించారు. దీనిపై హృతిక్​ రోషన్​, అజయ్​ దేవగణ్​, వరుణ్​ ధావన్​లు సామాజిక మాధ్యమాల్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కొవిడ్​-19 నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీస్​ ఉన్నాయని బృహన్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ (బీఎంసీ) ట్విట్టర్​లో ఇటీవలే తెలిపింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. బాలీవుడ్​ హీరోలు హృతిక్​ రోషన్​, అజయ్ దేవగణ్​, వరుణ్​ ధావన్​లు ట్విట్టర్​లో స్పందించారు.

"మీలో ఎవరైనా కొవిడ్​-19 నుంచి కోలుకుంటే.. కరోనాపై అస్త్రం మీరే అవుతారు. కంటికి కనిపించని శత్రువుతో చేసే పోరాటంలో మీరే మా సైన్యం. మీ రక్తంలో ఉండే బుల్లెట్లు (వైరస్​కు వ్యతిరేకంగా పోరాడే కణాలు) కరోనాను చంపడానికి ఉపయోగపడతాయి. అందుకే మీరు రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలకు అండగా నిలవండి."

- అజయ్​ దేవగణ్​, కథానాయకుడు

కరోనా బారి నుంచి కోలుకుని 14 రోజుల నిర్బంధాన్ని అధిగమించిన వారి రక్తంలో ఈ వైరస్​ను చంపగల కణాలు ఉంటాయని.. దీంతో మీ రక్తాన్ని ఇతరులకు దానం చేస్తే వారు కోలుకోవచ్చని హృతిక్​, వరుణ్​ ధావన్​లు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. అలాంటి వ్యక్తులు వారి రక్తాన్ని దానం చేసి కరోనాతో పోరాడుతున్న వారికి మద్దతుగా నిలవాలని కోరారు.

ఇదీ చూడండి.. 'బద్రి షూటింగ్​లో చాలా ఇబ్బందిపడ్డా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.