ETV Bharat / sitara

Princess Diana: డయానా.. బయోపిక్‌ల రారాణి! - ఎమ్మా కారిన్‌

ప్రపంచంలో అత్యధిక బయోపిక్‌లు వచ్చింది ఎవరిపైనో తెలుసా? అతిలోక సుందరి ప్రిన్సెస్ డయానాపైనే (Princess Diana Biopic). కెరీర్​లో ఒక్కసారైనా ఆమె పాత్రలో నటించాలని హీరోయిన్లు ఉవ్విళ్లూరుతుంటారు. ఇప్పటి వరకు ఆమెపై 11 బయోపిక్​లు వచ్చాయి. వాటి విశేషాలు చూడండి.

princess diana
ప్రిన్సెస్ డయానా
author img

By

Published : Nov 20, 2021, 12:19 PM IST

Updated : Nov 20, 2021, 10:52 PM IST

చిన్నచితకా నటుల నుంచి హాలీవుడ్‌ స్టార్లదాకా ప్రతి ఒక్కరికీ ఓ డ్రీమ్‌ రోల్‌ ఉంటుంది. ఒక్కసారైనా ఆ పాత్ర పోషించాలని ఉంటుంది. ఇంతకీ 'ఆ' ఆశ ఏంటో తెలుసా? అత్యధికమంది హీరోయిన్లు, ముఖ్యంగా హాలీవుడ్‌ నటీమణులు కోరుకునే పాత్ర ప్రిన్సెస్‌ డయానా (Princess Diana) బయోపిక్‌లో నటించడం. ఔను మరి! ఆ అతిలోక సౌందర్యరాశి, మనసున్న మారాణి జీవితపాత్రలో (Princess Diana Biopic) నటించడం వాళ్లకో గౌరవం. అందుకే ప్రపంచంలో అత్యధిక బయోపిక్‌లు వచ్చింది డయానాపైనే. ఇప్పటిదాకా డయానా జీవితచరిత్ర (Diana Life Story) పై 11 సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. ఎవరెవరు అందులో నటించారు? హిట్‌ అయిన సినిమాలేంటి అంటే...!

princess diana
సెరీనా స్కాట్

సెరీనా స్కాట్‌ థామస్‌: ప్రిన్సెస్‌ డయానా చనిపోయిన (Princess Diana Death) తర్వాత వచ్చిన మొదటి బయోపిక్‌, బయో డాక్యుమెంటరీలో సెరీనా నటించింది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఆండ్రూ మార్టన్‌ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో సెరీనా నటించింది. బ్రిటీష్‌ రాచ కుటుంబం.. ప్రిన్స్‌ ఛార్లెస్‌ (Princess Diana Husband), డయానా మధ్య వచ్చిన మనస్పర్థలు, సంసారంలోని పొరపొచ్చాలు, వివాదాలు, విడాకులు, డయానా ఇతరులతో నడిపిన ప్రేమాయణం.. వీటన్నింటినీ ఈ చిత్రంలో చూపించారు.

princess diana
జెనివీవ్ ఓ రీలీ

జెనివీవ్‌ ఓ రీలీ: అందంతోనే కాదు.. సమాజ సేవతో అంతులేని జనాభిమానం సంపాదించిన ప్రిన్సెస్‌ డయానాపై వచ్చిన డాక్యుమెంటరీ డ్రామా 'పీపుల్స్‌ ప్రిన్సెస్‌'. 2007లో టీఎల్‌సీ ఛానెల్లో ప్రసారమైన ఈ డాక్యుమెంటరీలో జెనివీవ్‌ ఓ రిలీ నటించింది. డయానా జీవించిన ఉన్న కాలంలో తీసుకున్న ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తూనే, మధ్యమధ్యలో తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ డాక్యుమెంటరీని మలిచారు. డయానా 1997లో కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యేవరకూ తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ఇందులో చూపించారు.

princess diana
బోనీ సాపర్

బోనీ సాపర్‌: ఒకటి కాదు.. రెండుసార్లు ఈ హలీవుడ్‌ నటి డయానా బయోపిక్‌లలో (Princess Diana Biopic Movie) ఒదిగిపోయింది. హ్యారీ అండ్‌ మేగన్‌: ఏ రాయల్‌ రొమాన్స్‌, హ్యారీ అండ్‌ మేగన్‌: బికమింగ్‌ రాయల్‌ అనే రెండు బయో సినిమాల్లో లేడీ డయానా పూర్తి జీవితాన్ని తెరకెక్కించారు. 2018, 2019 సంవత్సరాల్లో ఈ సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో హీరోలు మారినా.. బోనీ సాపర్‌ మారలేదు. తను నటించలేదు.. జీవించింది అనేంత పేరు సంపాదించుకుంది.

princess diana
ఎమ్మా కారిన్

ఎమ్మా కారిన్‌: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన 'ది క్రౌన్‌' బాగా పాపులరైన ఓటీటీ సిరీస్‌. ఇందులో యంగ్‌ డయానాగా నటించింది ఎమ్మా కారిన్‌. డయానా గురించి బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో వ్యక్తిగత (Princess Diana Wedding) వివరాలు ఇందులో ప్రస్తావించారు. పోలికలు అచ్చుగుద్దినట్టు లేకపోయినా హావభావాలు, హుందాతనం, నటన విషయంలో డయానాని దించేసినట్టు ఎమ్మాని అంతా పొగిడారు. కాకపోతే ఈ సిరీస్‌ ఐదో సీజన్‌లో ఎమ్మా స్థానంలో ఎలిజబెత్‌ డెబికీని తీసుకున్నారు.

princess diana
క్రిస్టెన్ స్టీవార్ట్

క్రిస్టెన్‌ స్టివార్ట్‌: తాజాగా 'స్పెన్సర్‌' చిత్రంలో డయానా పాత్ర పోషించింది స్టార్‌ హీరోయిన్‌ (Princess Diana Biopic Kristen Stewart) క్రిస్టెన్‌ స్టివార్ట్‌. డయానా బ్రిటీష్‌ రాచకుటుంబంలో ఇమడలేకపోయిన వైనం, ప్రిన్స్‌ ఛార్లెస్‌తో వివాదాలు, తదనంతరం తీవ్ర మానసిక ఒత్తిడికి గురై విడాకులు తీసుకోవడం.. సైకలాజికల్‌ డ్రామా ఆధారంగానే ఈ సినిమా నడిపించారు. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర అత్యధిక వసూళ్లు రాబట్టింది.

princess diana
జెన్నా డీ వాల్

జెన్నా డీ వాల్‌: డయానాకి మ్యూజిక్‌, సినిమాలపై ఉన్న ఆసక్తిని ప్రధానంగా చూపిస్తూ నెట్‌ఫ్లిక్స్‌లో తెరకెక్కిన ఓటీటీ 'డయనా: ది మ్యూజికల్‌'. ఈ బయోపిక్‌లో జెన్నా నటించింది. ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చివరి వీడియో చిత్రం ఇదే. ఈ ఏడాదే రూపొందించారు.

ఇదీ చూడండి: హ్యరీ, మేఘన్​ ఇంట 'డయానా' సందడి!

Last Updated : Nov 20, 2021, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.