ETV Bharat / sitara

సోహైల్​ కొత్త సినిమా షురూ.. డబ్బింగ్​ పనుల్లో 'గాలిసంపత్​' - బట్టల రామస్వామి బయోపిక్​

'బిగ్​బాస్'​ ఫేమ్​ సోహైల్​ హీరోగా తన తొలి సినిమా ప్రారంభమైంది. గోపీచంద్​ 'సీటీమార్' టైటిల్​ సాంగ్​ రికార్డు వ్యూస్​తో దూసుకెళ్తోంది. '​లవ్​ లైఫ్​ అండ్​ పకోడి'​ ట్రైలర్​ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకా పలు చిత్ర విశేషాలు కూడా ఉన్నాయి.

gali sampath
గాలి సంపత్​
author img

By

Published : Mar 3, 2021, 3:39 PM IST

'బిగ్​బాస్'​ ఫేమ్​ సోహైల్​ హీరోగా రానున్న అతడి తొలి సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. శ్రీనివాస్​ విం​జనం​పాటి దర్శకత్వం వహిస్తున్నారు. అప్పిరెడ్డి, సజ్జలా రవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

sohail
సోహైల్ హీరోగా​ కొత్త సినిమా షురూ

మంచు విష్ణు, కాజల్​ అగర్వాల్​, సునీల్​ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మోసగాళ్లు' సినిమా తెలుగుతో పాటు తమిళ్​, కన్నడ, హిందీ,మలయాళం భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ భాషల్లో చిత్ర టైటిల్స్​తో కూడిన పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు జెఫ్రీ జి చిన్ దర్శకత్వం వహించారు. జూన్​ 5న తెలుగులో విడుదల కానుందీ సినిమా.

కథానాయకుడు గోపీచంద్, దర్శకుడు సంపత్​ నంది కాంబినేషన్​లో రూపొందుతోన్న కొత్త చిత్రం 'సీటీమార్​'. కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాలో.. గోపీచంద్​ సరసన హీరోయిన్​గా తమన్నా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్​ సాంగ్​ను నేడు ఉదయం విడుదల చేశారు హీరోయిన్​ సమంత. ప్రస్తుతం ఈ సాంగ్​ రికార్డు వ్యూస్​తో దూసుకెళ్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రామ్​ నారాయణ్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'బట్టల రామస్వామి బయోపిక్'​ సినిమా మోషన్​ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో అల్తాఫ్​, లావణ్య రెడ్డి, శాంతి రావ్​ ప్రధాన పాత్రల్లో నటించారు.

కార్తీక్ బిమల్ రెబ్బా, సంచితా పూనాచ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్ లైఫ్ అండ్ పకోడి'. ఈ సినిమా​ ట్రైలర్​ను యువ హీరో అల్లు శిరీష్​ విడుదల చేశారు.

శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్​ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'గాలి సంపత్'. తాజాగా ఈ సినిమా డబ్బింగ్​ పనుల్లో బిజీగా ఉన్నారు రాజేంద్రప్రసాద్​. దానికి సంబంధించిన వీడియోను ట్వీట్​ చేసింది చిత్రబృందం. స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 11న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇదీ చూడండి: రామ్​చరణ్ హీరోయిన్​గా కొరియన్ భామ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.