ETV Bharat / sitara

వికారాబాద్​లో 'భీమ్లానాయక్'.. ఆ ఈవెంట్​కు చీఫ్ గెస్ట్​గా పవన్ - prateek gandhi vidy balan movie

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో భీమ్లానాయక్, అర్జున ఫాల్గుణ, పిప్పా తదితర చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

pawan klayan bheemla nayak
పవన్ కల్యామ్ భీమ్లా నాయక్
author img

By

Published : Dec 16, 2021, 3:44 PM IST

Bheemla nayak movie: సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న పవర్​స్టార్ పవన్​ కల్యాణ్ 'భీమ్లానాయక్'.. చివరిదశ షూటింగ్​లో బిజీగా ఉంది. ప్రస్తుతం వికారాబాద్​లో చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

pawan klayan bheemla nayak
భీమ్లా నాయక్ షూటింగ్​లో పవన్-రానా

అడవి బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్​.. ఫారెస్ట్​ పోలీస్ అధికారిగా నటించారు. రానా మరో ప్రధాన పాత్ర పోషించారు. నిత్యామేనన్, సంయుక్త హెగ్డే హీరోయిన్లు. త్రివిక్రమ్ స్క్రీన్​ప్లే మాటలు అందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. జనవరి 12న థియేటర్లలోకి ఈ సినిమా రానుంది.

Trivikram wife dance play: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్​ శ్రీనివాస్ సతీమణి సౌజన్య శ్రీనివాస్.. 'మీనాక్షి కల్యాణం' నృత్యరూపక ప్రదర్శన ఇవ్వనున్నారు. హైదరాబాద్​లోని శిల్పాకళావేదికలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి ముఖ్యఅతిథిగా హీరో పవన్​కల్యాణ్ విచ్చేయనున్నారు.

trivikram wife dance play
త్రివిక్రమ్ సతీమణి నృత్యరూపకం

స్వతహాగా స్నేహితులైన త్రివిక్రమ్-పవన్​కల్యాణ్.. ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. వీటిలో 'జల్సా', 'అత్తారింటికి దారేది'.. అద్భుతమైన హిట్లు సాధించగా, 'అజ్ఞాతవాసి'.. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న సినిమా 'భీమ్లా నాయక్'.

Arjuna phalguna release date: శ్రీవిష్ణు 'అర్జున ఫాల్గుణ' రిలీజ్​ డేట్ ఖరారైంది. ఈ డిసెంబరు 31న థియేటర్లలోకి సినిమాను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇందులో అమృత అయ్యర్ కథానాయిక. ఈ చిత్రంలో శ్రీవిష్ణు, హీరో ఎన్టీఆర్​కు అభిమానిగా కనిపించనున్నారు.

arjuna phalguna release date
అర్జున ఫాల్గుణ మూవీ రిలీజ్ డేట్

విభిన్న కథతో తెరకెక్కిన ఈ సినిమాకు తేజ మర్ని దర్శకత్వం వహించారు. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి నిర్మించారు.

*1971 యుద్ధ నేపథ్యంగా తీస్తున్న సినిమా 'పిప్పా'. ఇషాన్ కట్టర్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాది డిసెంబరు 9గా నిర్ణయిస్తూ పోస్టర్​ను రిలీజ్ చేశారు.

pippa release date
పిప్పా రిలీజ్ డేట్ పోస్టర్

ఈ సినిమా షూటింగ్ అమృత్​సర్, పశ్చిమబెంగాల్, ముంబయి, అహ్మద్​నగర్​లలో చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా, రాజ్ మేనన్ దర్శకత్వం వహిస్తున్నారు. రోనా స్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

*'స్కామ్ 1992' ఫేమ్ ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం వెల్లడించింది. ఇందులో విద్యాబాలన్, ఇలియానా కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాడ్ ఫిల్మ్​మేకర్ శిరీష గుహ.. ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

pratik gandhi vidya balan
ప్రతీక్ గాంధీ-విద్యాబాలన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.