ETV Bharat / sitara

'సల్మాన్‌ రిక్వెస్ట్‌ చేస్తేనే కౌగిలించుకున్నా' - maine pyar kiya salman khan

ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా బాలీవుడ్​ హీరో సల్మాన్​ ఖాన్​ను కౌగిలించుకున్నట్లు గుర్తుచేసుకున్న సీనియర్​ నటి భాగ్యశ్రీ.. ఆ సమయంలో బాగా ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఇంకా ఆ చిత్ర షూటింగ్​ గురించి పలు విశేషాలను వెల్లడించారు.

Bhagyashree
భాగ్యశ్రీ
author img

By

Published : Sep 5, 2021, 9:09 AM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ రిక్వెస్ట్‌ చేయబట్టే తాను ఆయన్ని కౌగిలించుకున్నానని అలనాటి నటి భాగ్యశ్రీ (Bhagyashree movies) తెలిపారు. వీరిద్దరూ జంటగా నటించిన సెన్సేషనల్‌ సూపర్‌హిట్‌ చిత్రం 'మై నే ప్యార్‌ కియా' (Maine pyar kiya). 1989లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఓ పాపులర్‌ షోలో అతిథిగా పాల్గొన్న భాగ్యశ్రీ 'మై నే ప్యార్‌ కియా' (Maine pyar kiya kissing scene) రోజుల్ని గుర్తు చేసుకున్నారు. సినిమా చిత్రీకరణ ప్రారంభమైన రోజుల్లో కొంత ఇబ్బందిపడ్డానని.. ఆ తర్వాత సెట్‌లో ఉన్న వాళ్లందరూ బాగా పరిచయమైపోయారని ఆమె తెలిపారు. షూట్‌ను బాగా ఎంజాయ్‌ చేశానని అన్నారు.

Maine pyar kiya kissing scene
మై నే ప్యార్​ కియాలో ఓ సీన్​

సల్మాన్‌తో నటించడం గురించి మాట్లాడుతూ.. 'ఆ సినిమా షూటింగ్‌ అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. అప్పటికే నేను ప్రేమలో ఉన్నా. త్వరలో పెళ్లి చేసుకోవాలని మేము అనుకున్నాం. దానివల్ల సినిమాలోని ఓ సన్నివేశం కోసం సల్మాన్‌ని కౌగిలించుకోవడానికి నేను కంగారుపడ్డా. త్వరలో ప్రేమించినవాడితో ఏడడుగులు వేయాలని నిర్ణయించుకుని.. వేరే వ్యక్తిని ఎలా కౌగిలించుకోవాలి? అని బాధపడ్డా. ఆ సీన్‌ చేయనని చెప్పేయాలనుకున్నా. అప్పుడు సల్మాన్‌ నా వద్దకు వచ్చి.. 'ప్లీజ్‌.. సినిమా కోసం ఈ సీన్‌ చేయండి' అని అడిగారు. ఆయన మాటకు గౌరవమిచ్చి ఓకే అన్నాను. మరో సన్నివేశంలో సల్మాన్‌-నేనూ ముద్దుపెట్టుకోవాలి. ఆ సీన్‌ చెప్పగానే ఇబ్బందిపడ్డా. నా ఇబ్బందిని గుర్తించిన దర్శకుడు సల్మాన్‌కి నాకు మధ్య ఓ అద్దం అడ్డుపెట్టారు. మేమిద్దరం ఆ గ్లాస్‌ను ముద్దుపెట్టుకుంటే చాలు అన్నారు. అలా, ఆ కిస్‌ సీన్‌ (maine pyar kiya kissing scene) షూట్‌ చేశారు.' అని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు.

Maine pyar kiya kissing scene
మై నే ప్యార్​ కియాలో ఓ సీన్​

మరోవైపు, ప్రస్తుతం భాగ్యశ్రీ రెండు భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌'లో(radhe shyam movie) ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే, జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న 'తలైవి'లోనూ ముఖ్య భూమిక పోషించారు.

Bhagyashree
భాగ్యశ్రీ

ఇదీ చూడండి: అలా చెప్పుకునేందుకు ఎక్కువ ఇష్టపడతా: బుచ్చిబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.