ETV Bharat / sitara

సినీ పరిశ్రమలో 15మందికి డ్రగ్స్​ ముఠాతో లింకు!

author img

By

Published : Sep 1, 2020, 7:15 PM IST

డ్రగ్స్​ కేసులో కన్నడ సినీ పరిశ్రమలోని 15 మంది ప్రముఖుల పేర్లను సీసీబీ చేసిన విచారణలో బయటపెట్టారు సినీప్రముఖడు, జర్నలిస్టు ఇంద్రజిత్​ లంకేశ్​. వీరంతా ముంబయికి చెందిన మాదక ద్రవ్యాల సరఫరదారుల వద్ద కొనుగోలు చేస్తారని చెప్పాడు.

Indrajit
ఇంద్రజిత్

మాదక ద్రవ్యాల ముఠాతో లింకు ఉన్న కన్నడ సినీ పరిశ్రమకు చెందిన దాదాపు 15మంది ప్రముఖుల పేర్లను వెల్లడించాడు సినీప్రముఖుడు, జర్నలిస్ట్​ ఇంద్రజిత్​ లంకేశ్​. వీరంతా ముంబయికి చెందిన డ్రగ్స్​ సరఫరదారుల వద్ద కొనుగోలు చేస్తారని తెలిపాడు. సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్(సీసీబీ)​ తనను చేసిన విచారణలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.

"బడా సంగీతకారులు, నటులు డ్రగ్స్​ ముఠాతో సంబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం వారు సమాజంలో యూత్​​ ఐకాన్​గా వెలుగొందుతున్నారు. వారి పేర్లను అధికారులకు తెలిపా."

-ఇంద్రజిత్​ లంకేశ్​, సినీ ప్రముఖుడు జర్నలిస్ట్​

బెంగళూరులో డ్రగ్స్ మాఫియా విజృంభిస్తుందన్న సమాచారంతో ఎన్​సీబీ చేపట్టిన ఆపరేషన్​లో పలు కీలక విషయాలు తెలిశాయి. ఈ ఆపరేషన్​లో దాదాపు రూ. 2 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేసి.. పలువురు డ్రగ్ డీలర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న పలువురు ప్రముఖులను ఎన్​సీబీ ఇప్పటికే అరెస్ట్​ చేసింది.

ఇది చూడండి సినీ పరిశ్రమతో డ్రగ్స్​ ముఠా లింకులపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.