టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-స్టార్ హీరోయిన్ అనుష్క కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వీరిద్దరి కాంబోలో ఓ ఆసక్తికర కథతో సినిమా రూపొందనుందని సమాచారం. ఓ కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కించనున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇటీవల ట్విట్టర్లో అభిమానులతో అనుష్క ముచ్చటిస్తూ.. రెండు కొత్త సినిమాలను అంగీకరించానని, త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటనలు వస్తాయని అన్నారు. దీంతో ఆ రెండు సినిమాల్లో విజయ్-అనుష్క కాంబో ఒకటుందని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
ఇటీవల 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క. కాగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' (పరిశీలన టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు విజయ్.